Mediators
-
చైనా గుప్పిట్లో పాక్ మీడియా? అమెరికా రిపోర్టులో ఏముంది?
అమెరికా నుంచి వెలువడిన ఒక రిపోర్టులో చైనాకు సంబంధించిన మరో వ్యూహం వెలుగుచూసింది. పాకిస్తాన్ మీడియాను చైనా తన నియంత్రణలోకి తెచ్చుకోవాలనుకుంటోందని ఈ రిపోర్టులో పేర్కొన్నారు. ఇందుకోసం చైనా తన ఇతర మిత్ర దేశాల సహకారం తీసుకుంటున్నదని సమాచారం. పాక్‌లో చైనా తన అంతర్జాతీయ ప్రచారాల నెట్‌వర్క్‌ను సిద్ధం చేస్తోందని నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రపంచంలో తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించుకునేందుకు, పలు విమర్శలను తిప్పికొట్టేందుకు చైనా సమాచార రంగంలో రష్యాతో కలిసి పని చేస్తోంది. కాగా పాకిస్తాన్లో చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీపీఈసీ ప్రాజెక్టుపై అంతర్జాతీయ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో సీపీఈసీ మీడియా ఫోరమ్ ద్వారా ఈ ఆరోపణలు ఎదుర్కోవాలని చైనా నిర్ణయించుకుంది. ఇందుకోసం చైనా, పాకిస్తాన్ సంయుక్తంగా సీపీఈసీ ర్యాపిడ్ రెస్పాన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ప్రచారాన్ని ప్రారంభించాయి. దీనిలో భాగంగా చైనా-పాకిస్తాన్ మీడియా కారిడార్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2021లో చైనా పాకిస్తాన్ల మధ్య ఈ అంశంపై చర్చలు కూడా జరిగాయి. చైనాపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టేందుకు రెండు దేశాలు సంయుక్తంగా ఒక వేదికను రూపొందించడంపై కూడా చర్చిస్తున్నట్లు యుఎస్ నివేదిక పేర్కొంది. చైనా రాయబార కార్యాలయానికి సంబంధించిన వార్తలకు పాక్ మీడియాలో అత్యధికప్రాధాన్యత కల్పించనున్నారు. చైనా ప్రభుత్వం తనకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా బిలియన్ల డాలర్లను ఖర్చు చేస్తోందని నివేదిక పేర్కొంది. తైవాన్, మానవ హక్కులు, దక్షిణ చైనా సముద్రం, దేశీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రతికూల వార్తలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రిపోర్టులో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే? -
అంతర్జాతీయ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా మాజీ జస్టిస్ ఎన్వీ రమణ!
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్‌లోని ప్రధాన తెలుగు సంస్థలైన సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవపూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియజేసి సత్కరించారు. “తెలుగువారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణను, వారి సింగపూర్ పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు వారంతా ఒక్కటిగా, ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు. (చదవండి: ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు!) -
‘నీ పని అవ్వాలంటే రూ.2000 ఇవ్వాల్సిందే.. లేదంటే..’
‘జిల్లా కేంద్రానికి చెందిన చంద్రశేఖర్ తన కూతురు జనన ధ్రువీకరణ పత్రం తీసుకునేందుకు ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ కనిపించిన ఓ సిబ్బందిని బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చే కార్యాలయం అడ్రస్ అడగగా, సర్టిఫికెట్ తీసుకోవడం పెద్ద ప్రాసెస్ ఉంటుందని.. తనకు రూ.2000 ఇస్తే వారం రోజుల్లో సర్టిఫికెట్ చేతులో పెడతానని నమ్మబలికాడు. చేసేది లేక చంద్రశేఖర్ డబ్బులు ఇచ్చి వారం రోజుల తర్వాత సర్టిఫికెట్ తీసుకున్నాడు.’ కరీంనగర్‌టౌన్: జిల్లా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో మ్యాన్వల్గా ఇచ్చే సర్టిఫికెట్లను ఏడాది కాలంగా నుంచి ఆన్‌లైన్‌కు మార్చారు. మీసేవలో దరఖాస్తు చేసుకొని ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్‌కు వందలు, వేలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది చేతి వాటం ప్రదర్శిస్తూ అమాయకుల వద్ద అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. మ్యాన్వల్గా ఇచ్చిన సర్టిఫికెట్లు అన్ని ప్రాంతాలలో చెల్లడం లేదనే ఉద్దేశంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో డెలివరీ అయిన పిల్లలకు సైతం జనన ధ్రువీకరణ పత్రాలు మీసేవలోకి మార్చారు. మ్యాన్వల్గా ఉన్నప్పుడు దందా నడిపించిన కేటుగాళ్లు ఆన్‌లైన్‌కు మార్చినా వదలడం లేదు. అమాయకులు సర్టిఫికెట్ల కోసం ఆసుపత్రికి వస్తే వారిని మోసం చేస్తూ డబ్బులు వసూళ్లకు తెగబడుతున్నారు. కొంత మంది సిబ్బంది ఆసుపత్రి ముందు తిష్ట వేసి సర్టిఫికెట్ల కోసం వచ్చేవారి అవసరాన్ని ఆసరాగా చేసుకొని వేలల్లో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా మీసేవకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లో సర్టిఫికెట్ వస్తుంది. అది తెలియని వారిని దళారులు బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా ఉచితంగా పొందాల్సిన సర్టిఫికెట్లకు వేలల్లో వసూలు చేస్తుండడంతో సర్టిఫికెట్లు పొందే వారు ఆందోళన చెందుతున్నారు. మరణ ధ్రువీకరణాల పరిస్థితి దారుణం జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లకే ఇంత ఇబ్బంది అవుతుంటే ఇక మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల విషయంలో చుక్కలు చూపిస్తున్నారు. ఏకంగా సిబ్బందితో కుమ్మక్కై దళారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆన్లైన్లో రికార్డు లేకపోతే ఆసుపత్రి నుంచి మరణ నివేదికను తీసుకెళ్లి మున్సిపల్ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని రికార్డులను దాచిపెట్టి దొరకడం లేదంటూ ఆసుపత్రి చుట్టూ తిప్పుకుంటున్నారు. చివరకు బేరం కుదిరితే రికార్డులు దొరికాయంటూ మరణ నివేదిక రాసి ఇస్తున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం.. జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం వచ్చేవారు ఎవరికీ డబ్బులు ఇవ్వద్దు. సర్టిఫికెట్లు ఆన్లైన్ ద్వారా ఉచితంగా పొందాలి. ఎవరైనా డబ్బులు అడిగితే నేరుగా ఆసుపత్రిలో ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతాం. ఆసుపత్రి సిబ్బంది డబ్బులు తీసుకున్నట్లు నిరూపణ అయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ జ్యోతి, జిల్లా ఆసుపత్రి ఆర్ఎంవో చదవండి: అబ్దుల్లాపూర్ మెట్లో దారుణం.. జంట మృతదేహాల కలకలం -
మాదన్నపేట మార్కెట్.. డబ్బు కొట్టు..బండి పెట్టు!
సాక్షి, చంచల్‌గూడ: పాతబస్తీలోని మాదన్నపేట మార్కెట్లో దళారీలు పేట్రేగిపోతున్నారు. ఈ మార్కెట్ ప్రైవేటు యాజమాన్యాది కావడంతో ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. కేవలం రైతుల కూరగాయలు అమ్మిపెట్టే కమీషన్ ఏజెంట్ల వద్ద నుంచి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఫీజు వసూలు చేస్తుంది. ఆకు కూరల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం రైతులు, కమీషన్ ఏజెంట్ల నుంచి ఎలాంటి ఫీజు వసూలు చేయదు. పలు రకాల ఆకు కూరలుతో పాటు కొత్తిమీర, కరివేపాకు విక్రయించేందుకు రంగారెడ్డి జిల్లాతో పాటు పలు రాష్ట్రాల నుంచి రైతులు నేరుగా ఈ మార్కెట్‌కు వస్తుంటారు. మార్కెట్లోని వ్యాపారులు రైతుల వద్ద నుంచి కూరగాయలు కొనుగోలు చేసి హోల్‌సేల్, రిటైల్ విక్రయాలు నిర్వహిస్తుంటారు. వాహనానికి రూ. 500 నుంచి రూ. 2 వేలు వసూలు ఇదిలా ఉండగా కొందరు రైతులు తమ వాహనాల్లో కూరగాయలు తెచ్చి నేరుగా అమ్మకాలు చేస్తారు. వాహనం నిలిపి విక్రయాలు చేస్తున్నందుకు కొందరు స్థానికులు, పాత నేరస్తులు రైతుల నుంచి ప్రతి రోజూ అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారు. ఒక్కో వాహనానికి రూ. 500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అమ్మకాలను బట్టి మామూళ్ల ధరలు నిర్ణయిస్తున్నారు. రైతులు స్థానికేతరులు కావడంతో అక్రమార్కులకు తలొగ్గి గత్యంతరం లేక డబ్బులు చెల్లిచుకుంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి వ్యవసాయ మార్కెట్, పోలీసు శాఖ దృష్టి సారించి రైతులపై జరుగుతున్న దౌర్జన్యాలను అడ్డుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. పీడీ యాక్ట్ నమోదు చేయాలి మాదన్నపేట కూరగాయల మార్కెట్లో అక్రమ వసూళ్లపై పోలీసులు, మార్కెట్ శాఖ దృష్టి సారించాలి. కూరగాయల రైతుల నుంచి కమీషన్ వసూలు చేసే వ్యవస్థను రద్దు చేయాలి. 2 శాతం కమీషన్ తీసుకోవాల్సిన ఏజెంట్లు అక్రమంగా 10 శాతం వరకు వసూలు చేస్తున్నా మార్కెట్ శాఖ చర్యలు తీసుకోవడం లేదు. ఏజెంట్ల ఆగడాలను అరికట్టేందుకు మార్కెట్లో ఫిర్యాదు సెల్‌ను ఏర్పాటు చేయాలి. రైతులను వేధిస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలి. – సహదేవ్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ -
ప్రేమజంటకు మధ్యవర్తిత్వం.. చివరికి ప్రాణాలు
సాక్షి, కర్నూలు: ఒక జంట ప్రేమ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రుద్రవరం మండలం పేరూరులో ప్రేమికుల మధ్య వారధిగా ఉన్నాడనే నెపంతో ప్రవీణ్ అనే యువకుడిపై అమ్మాయి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ యువకుడు బైక్ నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతిచెందాడు. ప్రస్తుతం ప్రేమికులు పరారీలో ఉన్నారు. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కృష్ణానదిలో.. ‘అలవి’ వేట!
సాక్షి, నాగర్‌కర్నూల్ : కృష్ణానదిలో నిషేధిత అలవి వలల వేట కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నిషేధించినప్పటికీ దళారులు దందాను దర్జాగా కానిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలైన వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. పోలీసు, మత్స్యశాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా, పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోడం లేదు. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడుల్లో ఏడు అలవి వలలు పట్టుబడ్డాయి. ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలోని కృష్ణానది తీర గ్రామాల మత్స్యకారులు, ప్రజలు దళారుల చర్యలతో ఉపాధి కోల్పోతున్నారు. ప్రతి ఏటా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు సుమారు ఎనిమిది నెలల పాటు ఈ ప్రాంత మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. కొంత మంది దళారులు అత్యాశతో ఆంధ్రాలోని వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి జాలర్లను తీసుకొచ్చి అలివి వలలతో చేపలను పట్టిస్తుండడంతో చిన్నచిన్న చేపపిల్లలు కూడా ఈ వలలో చిక్కుకుని బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారు. గుడారాల ముందు ఎండబెట్టిన చేపలు నిషేధం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అలవి వలలను నిషేధించింది. అయినా కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా వాటిని వినియోగిస్తూ చిన్న చేపలను సైతం వేటాడుతూ మత్స్ససంపదను కొల్లగొడుతున్నారు. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులతో అలవివేటను చేయిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, సోమశిల, అదేవిధంగా వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి, బెక్కెం, చెల్లపాడు, పెద్దమరూరు, చిన్నమరూర్, గ ద్వాల జిల్లా పరిధిలోని అలంపూ ర్, గొందిమళ్ల తదితర గ్రామాల పరిధిలోని కృష్ణాతీరంలో కొంత మంది దళారులు ఆంధ్రా మత్స్య కారులతో ఒప్పందాలు చేసుకొని అలవి వలలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ వలల్లో చిక్కుకుని 5 గ్రాముల చిన్నచిన్న చేపలు కూడా బయటికి వస్తాయి. వాటన్నింటినీ ఆరబోసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. చేపలు పెరిగి పెద్దయితే స్థానిక మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది. రష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మత్స్యకారుల కోసం లక్షల చేపపిల్లలు నదిలో వదులుతుండగా అవి పెరిగి పెద్దవి కాకముందే దళారులు అలవి వలల ద్వారా వేటాడుతున్నారు. మత్స్యకారులు ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నెరవేరని ప్రభుత్వ లక్ష్యం కృష్ణానదిలో చేపలు పట్టేవారిలో ఎక్కువశాతం ఆంధ్రాకు చెందిన మత్స్యకారులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతానికి చెందిన వారు దళారుల అవతారం ఎత్తి అక్కడి మత్స్యకారులకు అడ్వాన్స్‌లు ఇచ్చి వారితో చేపల వేట చేస్తున్నారు. కృష్ణానది మధ్య దీవుల్లో నివాసం ఉంటూ చేపల వేటకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ లక్షలాది చేపపిల్లలను నదుల్లో, చెరువుల్లో వదిలి ఉపాధి కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. -
మధ్యవర్తిత్వ గడువు పెంపు
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం భూ వివాదం కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించింది. ఈ కేసులో సామరస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ జస్టిస్ కలీఫుల్లా కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన బెంచ్ ఆగస్టు 15లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తిచేయాలని కమిటీని ఆదేశించింది. ఏళ్లుగా అయోధ్య కేసు పెండింగ్‌లోనే ఉందని, సామరస్య పరిష్కారానికి మరింత సమయం ఇస్తే తప్పేముందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వ కమిటీ అయోధ్య కేసుకు సంబంధించిన నివేదికను తమకు అందించినట్లు తెలిపింది. అయితే ఈ నివేదికలో ఉన్న విషయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 30లోగా వాటిని కమిటీ ముందుకు తీసుకొచ్చేందుకు అనుమతినిచ్చింది. అయోధ్య కేసులో సామరస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముగ్గురు వ్యక్తులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ దాదాపు 8 వారాల పాటు విచారణ చేపట్టిన అనంతరం మే 7న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది. -
అయోధ్య కేసు : మధ్యవర్తుల ప్యానెల్‌కు సుప్రీం సానుకూలం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం విచారణను ప్రారంభించింది. దశాబ్ధాల తరబడి సాగుతున్న అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాద కేసు పరిష్కారానికి కోర్టు పర్యవేక్షణలో మధ్యవర్తిత్వానికి అనుమతించాలనే లేదా అనే అంశంపై వాదనలు ఆలకించిన సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. అయోధ్య వివాద పరిష్కారానికి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సెక్షన్ 89 కింద మధ్యవర్తిత్వ ప్రక్రియకు అనుమతించాలా, లేదా అనే అంశంపై కోర్టు ఓ నిర్ణయానికి రానుంది. మరోవైపు అయోధ్య వివాద పరిష్కారానికి పలువురు మధ్యవర్తులతో కూడిన ప్యానెల్ అవసరమని జస్టిస్ ఎస్ఏ బోబ్డే అభిప్రాయపడ్డారు. కేసు విచారణ దశలో మీడియా కథనాలు అందించే విషయంలో సంయమనం పాటించాలని ఆయన సూచించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియ సాగే క్రమంలో మీడియా రిపోర్టింగ్‌కు దూరంగా ఉండాలని, మధ్యవర్తిత్వ ప్రక్రియ కొనసాగే సమయంలో ఎవరికీ ఎలాంటి ఉద్దేశాలూ ఆపాదించరాదని కోరారు. గతంలో జరిగిన దానిపై మనకు నియంత్రణ ఉండదని, ప్రస్తుత వివాదం మనకు తెలుసని, వివాదాన్ని ఎలా పరిష్కరించాలనే దానిపైనే తాము దృష్టి సారించామన్నారు. ఈ వివాదం పలువురి మనోభావాలు, మతవిశ్వాసాలతో ముడిపడిఉన్నందున దీని తీవ్రతను తాము గుర్తెరిగామని జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు. ముస్లిం పిటిషనర్ల అంగీకారం అయోధ్య కేసు సామరస్య పరిష్కారంలో భాగంగా మధ్యవర్తిత్వ ప్రక్రియకు ముస్లిం పిటిషనర్లు సంసిద్ధత వ్యక్తం చేశారు. కేసు పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి ముస్లిం పిటిషనర్లు అంగీకరిస్తారని, ఆయా పిటిషనర్ల తరపు న్యాయవాది రాజీవ్ ధావన్ కోర్టుకు నివేదించారు. మధ్యవర్తులు సూచించే పరిష్కారానికి అన్ని పార్టీలూ కట్టుబడి ఉండాలని సూచించారు. మధ్యవర్తిత్వ ప్రక్రియకు అవసరమైన విధివిధానాలను ఖరారు చేయాలని ఆయన రాజ్యాంగ ధర్మాసనాన్ని కోరారు. -
ఒక్కరోజులోనే అమ్మకానికి!
నారాయణపేట: రాష్ట్రంలోని గొల్ల, కురుమలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఒక్కో లబ్ధిదారుడు రూ.25 వేలు చెల్లిస్తే.. ప్రభుత్వం రూ.75 వేలు వెచ్చించి 21 గొర్రెలను అందిస్తోంది. వీటితో ఆయా లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగవచ్చనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే క్షేత్రస్థాయిలో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. నారా యణపేట జిల్లాలోని మరికల్‌కు చెందిన గొర్రెల కాపరులకు సోమవారం పశుసంవర్ధకశాఖ అధికారులు 64 యూనిట్లకు గాను లబ్ధిదారులు ఒక్కొక్క యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొటేలు చొప్పున అందజేశారు. అయితే కాపరులు గొర్రెలను పొంది ఒకరోజు సైతం తమ వద్ద పెట్టుకోకుండా దళారులతో కుమ్మక్కై బేరం చేసుకోవడంతో వాటిని ప్రత్యేక వాహనంలో నల్లగొండ జిల్లా మల్లెపల్లి ప్రాంతానికి తరలిస్తుండగా జడ్చర్ల వద్ద పట్టుబడడంతో ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. పక్క రాష్ట్రాల నుంచి.. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేసేందుకు పశుసంవర్ధకశాఖ అధికారులు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. ఆ సమయంలో మధ్యవర్తి సాయం తీసుకుంటున్నారు. అక్కడే గొర్రెకు పోగువేసి జిల్లాకు తరలించి లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మాచర్ల వద్ద గొర్రెలను కొనుగోలు చేసి తీసుకువచ్చి మరికల్లో కాపరులకు అందజేశారు. దళారులచే విక్రయాలు ప్రభుత్వ సబ్సిడీతో కొనుగోలు చేసిన గొర్రెలను ఎక్కడ పెంచుకుంటాం.. ఒక్కసారే అమ్మితే పోలా అంటూ కాపరులు అధిక సొమ్ముకు ఆశపడి దళారులతో కుమ్మక్కై గొర్రెలను విక్రయించేస్తున్నారు. ఒక్కో యూనిట్లో దాదాపు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు లాభాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ గొర్రెలు ఒక్కసారిగా విక్రయాలు చేయడంతో దళారులకు కాసుల పంటనే చెప్పవచ్చు. 64 యూనిట్లు అంటే 1344 గొర్రెలు. ఒక్కొక్క యూనిట్‌కు రూ. 50 వేల చొప్పున అధికంగా విక్రయించిన రూ.32 లక్షల లాభం వస్తుంది. ఇందులో లబ్ధిదారులకు సగం ఇచ్చినా.. మిగతా సగం దళారుల సొంతమవుతుంది. ఇందులో అధికారుల చేతివాటం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెలు అమ్మితే సభ్యత్వం రద్దు మరికల్ (నారాయణపేట): గొర్రెల కాపరుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన గొర్రెలను అక్రమంగా అమ్మి న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పశు సంవర్ధక శాఖ జేడీ దుర్గయ్య అన్నారు. మరికల్లో డీడీలు కట్టిన వారికి 64 యూనిట్లను మం జూరు చేశామని, ఈ మేరకు అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేసిన రోజు రాత్రికే చట్టానికి విరుద్ధంగా గొర్రెలను మాచర్ల కొనుగోలుదారులకు అమ్మిన లబ్ధిదారుల ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామన్నారు. అలాగే ఆ గ్రామాన్ని సైతం బ్లాక్ లిస్టులో పెట్టి మిగతా లబ్ధిదారులకు కూడా గొర్రెలను నిలిపివేస్తామన్నారు. దీంతోపాటు సం ఘం అధ్యక్షుడికి, ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేస్తామన్నారు. పట్టుబడిన గొర్రెలను డీడీలు కట్టిన ఇతర గ్రామాల లబ్ధిదారులకు అందజేస్తా మన్నారు. అక్రమంగా గొర్రెలను కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేశామని, ఆ దిశగా పోలీసులు విచారణ ప్రారంభించినట్లు చెప్పారు. ప్రభు త్వ సబ్సిడీ గొర్రెలను దొడ్డిదారిన అమ్మితే ఎంతటి వారైనా సరే కేసులు తప్పవని హెచ్చరించారు. -
భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న దళారులు
-
‘అగస్టా’ మధ్యవర్తి అప్పగింతకు ఇటలీ నో!
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తిని భారత్‌కు అప్పగించేందుకు ఇటలీ నిరాకరించింది. ఇటలీకి చెందిన కార్లో వాలెంటినో ఫెర్డినాండో గెరోసా (71) అనే వ్యక్తి భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి బంధువులతో భేటీ అయిన తర్వాతనే హెలికాప్టర్ల ప్రమాణాల్లో మార్పులు చేసే కుంభకోణం మొదలైందని ఆరోపణలున్నాయి. ఇప్పటికే కార్లోపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా ఇటలీ పోలీసులు అతణ్ని పట్టుకున్నారు. అయితే భారత్, ఇటలీల మధ్య పరస్పర న్యాయ సహాయ ఒప్పందమేదీ లేనందున భారత అభ్యర్థనను ఇటలీ తిరస్కరించింది. దీంతో ఒప్పందం లేకుండానే కార్లోను భారత్‌కు ఎలా రప్పించాలో వివరిస్తూ సీబీఐ విదేశాంగ మంత్రిత్వ శాఖ సాయం కోరింది. -
మార్కెట్ యార్డు లేక రైతుల విలవిల
ఆళ్లపల్లి : ప్రవేట్ దళారుల చేతిలో మోసపోవద్దని ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర అందించాలనే ఉద్దేశ్యంతో పండించిన పంటలకు మార్కెట్ యార్డు,కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు మేలు చేస్తుందనుకుంటే అతి తక్కువ రోజులు మార్కెట్ యార్డులను కేటాయించి, రైతులకు సమాచారం అందే లోపే మార్కెట్ యార్డులను మూసివేయడం ద్వారా మండలానికి సంబంధించిన కందులను పండించిన రైతులు నానా అవస్థలు పడుతున్నారు.ఎంతో కష్టంతో ఆరుగాలం పండించిన పంట అటు మార్కెట్ యార్డులు మూసివేయడంతో ఇంట్లో నిల్వ ఉన్న కందులను ప్రవేట్ దళారులకు తక్కువ ధరకు అమ్ముకోలేక రైతులు ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి కంటికి రెప్పలా కాపాడుకొని పండించిన పంట అతి తక్కువ ధరలకు దళారులకు అమ్ముకుంటే చాలా నష్టపోతామని,ఎలాగైనా ప్రభుత్వం మార్కెట్ యార్డులను తెరిపించి మమ్ములను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విన్నవించారు. –గొగ్గెల రమేష్,మైళారం మార్కెట్ యార్డులను పునఃప్రారంభించాలి మాకు సమాచారం అందేలోపే ప్రభుత్వం కేటాయించిన గడువు పూర్తి కావడంతో చాలా మనోవేధనకు గురయ్యానని,ఎలాగైనా మార్కెట్ యార్డులను పునఃప్రారంబించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. –గొగ్గెల సత్యనారాయణ,మైళారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా..మండల వ్యవసాయాధికారి ఆర్.శంకర్ రైతుల సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి దృష్టికి తీసుకెళ్తానని, మార్కెట్ యార్డును పునః ప్రారంభించాలాఆ కృషి చేస్తానని అన్నారు.పై అధికారుల నుంచిఆడర్ లేకుండా నేనేమీ చేయలేనని ఆయన అన్నారు. -
పసుపు రైతు పరేషాన్
పసుపు రైతుకు పరేషాన్ మొదలైంది. రోజురోజుకి పసుపు ధర పతనమవుతుండడం రైతులను కలవరపెడుతోంది. వారం వ్యవధిలో రూ.వెయ్యికి పైగా రేటు పడిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఆశతో మార్కెట్‌కు వెళ్లిన రైతులకు నిరాశే మిగులుతోంది. పది రోజుల క్రితం పసుపు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7500 నుంచి రూ.8 వేల ధర పలకగా, ప్రస్తుతం రూ.6,200 నుంచి రూ.6,500 దాటడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర పతనానికి దళారులే కారణమని, మార్కెట్‌కు పంట ఉత్పత్తులు పోటెత్తడంతో రేటు తెగ్గోస్తున్నారని పేర్కొంటున్నారు. మంచిగా ఆరబెట్టిన నాణ్యమైన సరుకుకు కూడా రూ.6,500 మించి చెల్లించడం లేదని వాపోతున్నారు. బాల్కొండ: జిల్లాలో 33 వేల ఎకరాల్లో పసుపు పంటను సాగవుతోంది. ఇప్పటివరకు సుమారు 50 శాతం పంట తవ్వకాలు పూర్తి కాగా, 30 శాతం పసుపును ఉడికించి మార్కెట్‌కు తరలించారు. పంట రాక ప్రారంభమైన సమయంలో మంచి ధరే పలికింది. రూ.8 వేల వరకు రావడం తో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఈ సంవత్సరమైనా గిట్టుబాటు ధర వస్తుంద ని అంతా భావించారు. అయితే, ప్రస్తుతం మార్కెట్‌కు పసుపు పోటెత్తుతుండడంతో ధర ఢమాలవుతోంది. సరుకు ఎక్కువగా వస్తుండడంతో దళారులు ధర తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పలుకుతున్న రూ.6,200 ధర ఏమాత్రం గిట్టుబాటు కాదని వాపోతున్నారు. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టి పంట సాగు చేశామని, ప్రస్తుత ధరతో కనీసం పెట్టుబడి కూడా రాదని పేర్కొంటున్నారు. ఇక, ‘ఈ–నామ్’లో కూడా పెద్దగా ధర రావడం లేదని చెబుతున్నారు. దిగుబడి బాగున్నా.. ఖరీఫ్‌లో కురిసిన అకాల వర్షాల వల్ల పసుపు పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందారు. అయితే, కొందరికి ఎకరానికి 8–9 ట్రాక్టర్ల కొమ్మ వస్తోంది. పంట దిగుబడి బాగానే వస్తుందని ఓ వైపు సంతోషంగా ఉన్నా, సరైన ధర దక్కక పోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. పెట్టుబడి కూడా తిరిగి పరిస్థితుల్లో పసుపు పంటకు బదులు ఇతర పంటలు సాగు చేసినా మేలుండేదని వాపోతున్నారు. అధిక పెట్టుబడి, దీర్ఘ కాలిక పంట కావడంతో రైతులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. అయినప్పటికీ సరైన ఫలితం దక్కడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో పడిగాపులు.. పసుపు విక్రయించేందుకు రైతులు మార్కెట్లో పడిగాపులు కాయాల్సి వస్తోంది. గతంలో పసుపు పంటను విక్రయించాలంటే రెండు రోజుల సమయం పట్టేది. ఒక రోజు బీటు, మరో రోజు కాంటాలు నిర్వహించే వారు. అయితే, గత నాలుగేళ్లుగా ఒక్క రోజులోనే బీటు, కాంటాలు నిర్వహిస్తున్నారు. దీంతో రైతులకు ఒకటే రోజులో పంట విక్రయాలు పూర్తయ్యేవి. కానీ ఈ సంవత్సరం మళ్లీ మొదటికొచ్చింది. కాంటాలు నిర్వహించడం ఆలస్యమవుతుండడం, పంట కొనుగోళ్లు సరిగా లేకపోవడంతో రైతులు 2–3 రోజులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు ఎన్ని నిబంధనలు పెట్టినా దళారుల హవానే కొనసాగుతోంది. ధరను తగ్గించారు.. వారం రోజుల క్రితం పలికిన ధర ఇప్పుడు లేదు. మార్కెట్లోకి ఎక్కువ కొమ్ము వస్తుండటంతో ధరను తగ్గిస్తున్నారు. ఈ రేటుకు అమ్ముకుంటే నష్టాలే మిగిలేది. దీని కన్నా పసుపు పంట పండించడం మానుకోవడమే మంచిది. – నర్సయ్య, రైతు, నాగంపేట్ పడిగాపులు.. పంట అమ్మేందుకు మార్కెట్‌కు వెళ్తే ఆడ పొద్దంతా పడిగాపులు కాయల్సి వస్తుంది. ధర కూడా వారానికి, ఇప్పటికి రూ.వెయ్యి తగ్గించారు. ఇలా ధర తగ్గిస్తే పెట్టిన పెట్టుబడి రాక అప్పులే మిగులుతాయి. ప్రభుత్వం స్పందించి పసుపు ధర పతనం కాకుండా చూడాలి. – జైడి సంతోష్‌రెడ్డి, రైతు, కొత్తపల్లి -
కొనుగోల్‌మాల్!
జిల్లాలోని భువనగిరి, ఆలేరులో ఏర్పాటు చేసిన హాకా కందుల కొనుగోలు కేంద్రాల్లో గోల్మాల్ జరుగుతోంది. రైతులు తెచ్చిన కందులను వెంటనే కొనకుండా వివిధ అడ్డంకులు సృష్టిస్తూ దళారులు తెచ్చిన కందులను క్షణాల్లోనే కొనేస్తున్నారు. దీంతో వ్యవసాయ మార్కెట్ యార్డులు అక్రమాలకు అడ్డాలుగా మారాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కందుల కొనుగోళ్ల విషయంలో దందా సాగుతున్నా.. ఎవరూ పర్యవేక్షించడం లేదు. ఫలితంగా జిల్లాలోని కందుల కొనుగోలు కేంద్రాలు ప్రజాప్రతినిధులు, అధికారులు, దళారులకు సిరులు కురిపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షి, యాదాద్రి : జిల్లాలోని భువనగిరి, ఆలేరు వ్యవసాయ మార్కెట్లలో ఐదురోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాలకవర్గాలు.. దళారులతో కుమ్మక్కై వారినుంచి టన్నుల కొద్దీ కందులను కొంటున్నారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన కందులను మాత్రం కొనకుండా రేపుమాపు అంటూ కేంద్రాలకు తిప్పుకుంటూ దళారులు తేగానే క్షణాల్లో కొనేస్తున్నారు. ఇందంతా అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోంది. ఇందుకు ఉదాహరణ ఆలేరులో ఐదు రోజుల క్రితం కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభించగా అదేరోజు ఆలేరు మండలానికి చెందిన ఓ రైతు 30 సంచుల కందులను తెచ్చాడు. ఆ రైతు తెచ్చిన కందులను ఈ రోజు వరకు కొనుగోలు చేయలేదు. ప్రతిరోజు కార్యాలయం చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిపోతున్నా.. స్పందన లేదు. మరోవైపు సోమవారం వరకు ఆలేరు మార్కెట్లో 1,400 క్వింటాళ్ల కందులు కొనుగోలు చేశారు. భువనగిరిలో 1,100 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు జరిగిన ఈ మొత్తం కొనుగోళ్లపై విచారణ జరిపిస్తే భారీ కుంభకోణం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు. తాజా ఘటన ఇలా.. మంగళవారం అనంతపురం జిల్లా నుంచి లారీలో తెచ్చిన కందులను భువనగిరి కొత్త మార్కెట్ యార్డులో విక్రయిస్తుండగా రెవెన్యూ అధికారులు పట్టుకోవడంతో దళారుల దందా వెలుగు చూసింది. ఈ కందులు అనంతపురం నుంచి వచ్చాయా లేక స్థానిక దళారులు తెచ్చినవా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా మార్కెట్ కమిటీ పాలకవర్గం, అధికారుల కనుసన్నలలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. గత సంవత్సరం కూడా కందుల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది. కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కందులు కొనుగోలు చేయడానికి పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్లు, వీఆర్వోల ధ్రువీకరణలతో వందలాది క్వింటాళ్ల కందులు మార్కెట్ యార్డ్‌ల్లో కొనుగోలు జరుగుతోంది. రూ.5,450 మద్దతు ధర.. జిల్లాలోని భువనగిరి, ఆలేరు, మార్కెట్‌యార్డ్‌లలో హాకా ద్వారా ప్రభుత్వం కందులను కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.5250, బోనస్ రూ.200 కలిపి ప్రతి క్వింటాల్‌కు రూ.5450 చెల్లిస్తున్నారు. సకాలంలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రకరకాల కొర్రీలతో కొనుగోలు చేయకుండా రైతులను తిప్పుకోవడంతో విసిగిపోయిన రైతులు గ్రామాల్లో దళారులకు క్వింటాల్ రూ.3500నుంచి రూ.4000 వరకు అమ్ముకుంటున్నారు. వీటిని దళారులు తిరిగి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రూ.5,450లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ కందులు ఎక్కడివి! ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన లారీలో 17 టన్నుల కందులు భువనగిరి మార్కెట్‌కు భువనగిరి మండలం పచ్చర్లబోడుతండాకు ఇస్మాయిల్ ఉదయం లారీలో తెచ్చాడు. సుమారు 7 టన్నుల వరకు కందులను లారీలోంచి మార్కెట్లో దించారు. విషయం గమనించిన రైతులు విషయం తెలుసుకున్న భువనగిరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, బొల్లేపల్లి వీఆర్ఓ లక్ష్మినర్సయ్యను పిలిపించి లారీలోంచి దించుతున్న కందులను అడ్డుకున్నారు. ఇదేలారీ మార్కెట్ నుంచి మాయమై రాత్రి వరకు భువనగిరి పట్టణ శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద సుమారు నాలుగు గంటల పాటు నిలిపివేశారు. అనంతరం అక్కడినుంచి ఆ లారీ వెళ్లిపోయింది. కానీ అది ఎక్కడికి వెళ్లిందో.. ఆ లారీ ఏమైనట్లో ఎవరికీ తెలియదు. అలాగే ఆలేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానిక దళారులతో కలిసి కందుల విక్రయాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తాము పండించిన కందులను కొనుగోలు చేయడానికి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం భువనగిరి మార్కెట్ యార్డ్‌లో గడ్డం శ్రీనివాస్ అనే వ్యాపారి విక్రయించిన 30 క్వింటాళ్ల కందులపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. కొనుగోళ్ల బాధ్యత ఔట్సోర్సింగ్ సిబ్బందిదే.. మార్కెట్ యార్డుల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారు. మార్కెట్ కార్యదర్శులు, ఇతర శాఖల అధికారులు కొనుగోలు బా«ధ్యతలను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగిస్తున్నారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు కనిపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిపై నిఘా లేకుండాపోయింది. ఇప్పటికైనా ఈ వ్యవహారంపై అధికారులు దృష్టి సారించి తమకు నాయ్యం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
పాస్ పోర్టు దొంగలు అరెస్ట్
వైఎస్సార్ జిల్లా(ప్రొద్దుటూరు): నిరుద్యోగుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు..అఖిల్ పాషా, మహబూబ్ పాషా అనే ఇద్దరు వ్యక్తులు గల్ఫ్ దేశాలకు పంపిస్తామని మాయమాటలు చెప్పి 36 మంది నిరుద్యోగుల వద్ద ఒక్కొక్కరి నుంచి రూ.20 వేలు వసూలు చేశారు. ఈ సంఘటన జరిగి చాలా రోజులై వీసాలు రాకపోవటంతో తాము మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల్ పాషా, మహబూబ్ పాషాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. తరచుగా పాస్‌పోర్టు మోసాలకు పాల్పడుతూ వస్తున్న ఇద్దరిపై పోలీసులు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. దీంట్లో అఖిల్ పాషాని కీలక పాత్రధారిగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. -
దళారుల చేతిలో రైతన్న దగా
కల్వకుర్తి రూరల్: అసలే కరువు పరిస్థితులు.. ఆపై పండిన కొద్దిపాటి పంటకు కూడా మద్దతుధర లభించక పత్తి రైతులు దళారుల చేతిలో దగాపడుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా ఆశించిన ధర లభించడం లేదు. కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ ఏడాది సుమారు 1.3లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ సీజన్లో పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ ద్వారా మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశారు. రోజుకు 50 క్వింటాళ్ల లెక్కన ఆయా కేంద్రాల ద్వారా ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలుచేసినట్లు అంచనా. ఇంతవరకు బాగానే ఉన్నా.. నాణ్యత పేరుతో రైతులను నిలువునా మోసం చేస్తున్నారు. రైతులకు మద్దతుధర కల్పిస్తూ సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేస్తూ రైతులకు మేలు చేకూర్చాలనే ప్రభుత్వం నిర్ణ యం కాటన్‌మిల్లుల యజమానులకు లాభాలపంట పండిస్తోంది. ప్రభుత్వ పత్తి క్వింటాలుకు రూ.4,050 చెల్లించాలని నిర్ణయించినప్పటికీ నాణ్యతను సాకుగా చూపుతూ క్వింటాలుకు రూ.3600 నుంచి రూ.3900 మాత్రమే చెల్లిస్తున్నారు. అదే పత్తిని బినామీ పాస్‌పుస్తకాల సాయంతో రైతుల నుంచే కొనుగోలు చేస్తున్నట్లుగా కాటన్‌మిల్ యజమానులు సీసీఐకి విక్రయిస్తున్నారు. ఇలా రైతులను నిండా ముంచుతూ కాటన్ మిల్లు నిర్వాహకులు భారీగా లాభాలు పొందుతున్నారు. చాలా మిల్లుల్లో రైతుల పాస్‌పుస్తకాల ద్వారా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐకి విక్రయిస్తున్నారు. చెక్కులకు బదులు చీటిలు నిబంధనల ప్రకారం పత్తిని విక్రయించేందుకు వచ్చిన రైతుకు చెక్కు ఇవ్వా ల్సి ఉంటుంది, అయితే అందుకు విరుద్ధంగా మిల్లుల నిర్వాహకులు బుక్కచీటిలు రాసిస్తున్నారు. దీనికితోడు నాణ్యతతో కూడిన పత్తిని తీసుకొచ్చినా.. ఏదో ఒక సాకుతో తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఇదేమటని కాటన్‌మిల్లు నిర్వాహకులను ప్రశ్నిస్తే కొనుగోళ్లను నిలిపేస్తున్నారు. దీనిపై సీసీఐ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో పాటు మిల్లుల్లో పత్తిని రెండు కుప్పలుగా విభజించి రెండు రకాలకు వేర్వేరు ధరలు నిర్ణయిస్తూ రైతులను దగా చేస్తున్నారు. రైతులు విక్రయించేందుకు తెచ్చిన పత్తిలో నాణ్యతాలోపం ఉన్నప్పటికీ కొంత ధర తగ్గించైనా సరే కచ్చితంగా కొనుగోలు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బుట్టదాఖలు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సాగుచేసిన పంటలో అధికమొత్తం నష్టపోయిన రైతులు, చేతికందిన కొద్దిపాటి పత్తికి సైతం మద్దతుధర లభించకపోవడంతో మరింత కుదేలవుతున్నారు. పత్తి విక్రయాలపై విచారణ జరిపి, మద్దతు ధర లభించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
దళారులదే హవా
ఏళ్లు గడుస్తున్నా.. పాలకులు మారుతున్నా.. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరుతున్నా.. కర్షకుల కష్టాలు మాత్రం తీరడం లేదు. నిత్యం వ్యయప్రయాసాల కోర్చి.. దిగుబడి వస్తున్నా.. రాకున్నా.. సాగు పోరాటంలో దిగుతున్న అన్నదాతలకు ఇబ్బందులు తప్పడంలేదు. సాగు సమయంలో ప్రకృతి పగబడితే.. ధాన్యం చేతికి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆసరానివ్వలేకపోతున్నాయి. కొద్దోగొప్పో వచ్చిన ధాన్యాన్ని అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేకపాయె. అరకొరగా ప్రారంభిస్తుండడంతో చివరికి ధాన్యం దళారులకే అమ్ముకోవాల్సి వస్తోం ది. దళారులేమో మద్దతు ధర చెల్లించక పోగా.. కాంటాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. క్వింటాల్‌కు 10 నుంచి 20 కిలోల వరకు చిలక్కొట్టుడు కొడుతున్నారు. ఫలితంగా రైతన్న నిలువునా దగాకు గురవుతున్నాడు. - ఆదిలాబాద్ అగ్రికల్చర్ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ఆశించిన మేర వర్షాలు కురియకపోవడంతో వరి సాగు తగ్గింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా ప్రకారం 60 హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉంది. కానీ.. అది 27 హెక్టార్లకే పరిమితమైంది. ఆలస్యంగానైనా కురిసిన కొద్దిపాటి వర్షాలతో ఈ కొద్ది మేర వరినాట్లు వేశారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 92,500 మెట్రిక్ టన్నుల ధాన్య దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వం కూడా గ్రేడ్ ఏ ధాన్యానికి రూ.1,400, మధ్యరకం ధాన్యానికి రూ.1,360 ధర నిర్ణయించింది. ప్రస్తుత దిగుబడి ధాన్యం చేతికి వస్తోంది. ప్రభుత్వం ఏటా మాదిరిగానే ఈసారీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. దీంతో దిగుబడి వస్తున్నా.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవాల్సి వస్తోంది. అధికారులు జిల్లా వ్యాప్తంగా 194 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించి.. చివరికి 71 కేంద్రాలకే పరిమితమయ్యారు. ఐకేపీ 50, పీఏసీఎస్ 18, డీసీఎమ్మెస్ కొన్ని మండలాల్లో మాత్రమే కొనుగోళ్లు ప్రారంభించాయి. ఇప్పటివరకు వీటన్నింటి పరిధిలో 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఈ ఏడాది సుమారుగా ఇంకా 34 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది 52 వేల క్వింటాళ్ల వరిధాన్యాన్ని ప్రభుత్వం తరఫున కొనుగోలు చేశారు. తూకాల్లో మోసాలు.. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడంతో.. కొనుగోలు కేంద్రాలు లేని ఏరియాలను దళారులు ఎంచుకున్నారు. దీంతో వ్యాపారులు రైతుల పంట పొలాల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని జైపూర్, నెన్నెల, వేమనపల్లి, లక్ష్మణచాంద, లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం, బెల్లంపల్లి, కౌటాల తదితర మండలాల్లో రైతులు దళారులకే విక్రయిస్తున్నారు. కాగా.. దళారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వరకు చెల్లిస్తున్నా తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు మధ్య రకం ధాన్యానికి రూ. 1,300, సన్నరకం ధాన్యానికి రూ.1,700 వరకు చెల్లిస్తున్నారు. తూకాల్లో మాత్రం క్వింటాల్‌కు 10 నుంచి 20 కిలోల వరకు మోసం చేస్తున్నారు. దీన్ని కనిపెట్టిన వారు నిలదీస్తే తేమ శాతం చూడకుండానే కొనుగోలు చేస్తున్నందునా బరువు ఎక్కువగా వ స్తుందని, అందుకే ధర ఎక్కువగా చెల్లించి కొనుగోలు చేస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. అసలే కరువు నేపథ్యంలో జిల్లాలో అంతంత మాత్రంగానే వరిధాన్యం సాగైంది. దీంతో రానున్న రోజుల్లో బియ్యం ధరలకు రెక్కలొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో దళారులు జోరుగా తమ దందాను కొనసాగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.. - చరణ్‌దాస్, డీఆర్డీఏ ఏపీడీ జిల్లాలో 71 కేంద్రాలు ఏర్పాటు చేసి 13,304 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. కొన్ని మండలాల్లో ఆలస్యంగా వరినాట్లు వేయడంతో దిగుబడి రాక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వారం రోజుల్లో కడెం, ఖానాపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, మామడ, జన్నారం, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి తదితర మండలాల్లో ఏర్పాటు చేస్తాం. మరో 35 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తున్నాం. -
పోలీసులనే బురిడీ కొట్టించారు
విజయవాడ సిటీ : రాష్ట్రంలో సంచలనం కలిగించిన పెద అవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసు నిందితుల అరెస్టులో పోలీసులను మధ్యవర్తులు బురిడీ కొట్టించారు. నిందితులు నేరుగా తమ వద్దకే వచ్చి లొంగిపోతారని పోలీసులు ధీమాతో ఉన్నారు. వారి దిమ్మ తిరిగేలా ఆరుగురు నిందితులు కోర్టులో లొంగిపోయి ఝలక్ ఇచ్చారు. ఏలూరుకు చెందిన తమ న్యాయవాది ద్వారా ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులైన పురాణం గణేష్, ఊరా గోపి, తూరపాటి పెదబాబు, సిరిగిరి గోపరాజు, కిన్నెర శ్రీను, చేజర్ల వెంకటేష్ గురువారం ఉదయం గన్నవరం కో ర్టులో లొంగిపోయారు. దీంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై గత సెప్టెంబర్ 24న జరిగిన గంధం నాగేశ్వరరావు, ఆయన ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్య హత్య కేసులో 22 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిలో ఢిల్లీకి చెందిన కిరాయి హంతకులు ఎనిమిది మంది కాగా.. మిగిలిన వారు పినకడిమి గ్రామానికి చెందిన కుట్రదారులు. ప్రధాన కుట్రదారుడు భూతం గోవింద్ విదేశాల్లో తల దాచుకోగా.. మిగిలిన వారు ఈ హత్యల తర్వాత వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు.. ఈస్ట్‌జోన్ ఏసీపీ ఉమామహేశ్వరరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందం(సిట్)ను ఏర్పాటు చేశారు. కేసులో ఆధారాల సేకరణ, నిందితుల పట్టివేతను సిట్‌కు అప్పగించారు. అరెస్టయింది వీరే సిట్ ఏర్పాటుకు ముందే ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల సాయంతో కిరాయి షూటర్స్ ప్రతాప్‌సింగ్ అలియాస్ అనుజ్, ధరమ్వీర్ అలి యాస్ సల్లు, నితిన్, నీరజ్‌తో పాటు కుట్రదారులతో ఒప్పందం చేసుకున్న మంజిత్‌సింగ్, సతీష్‌కుమార్, పంకజ్ అలియాస్ ప్రకాష్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సిట్ బృందం పినకడిమి గ్రామానికి చెందిన భూతం బాలాజీ, పాస్తం మహేష్, పాలపాటి శివను అక్టోబర్ 16వ తేదీన అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు ‘సిట్’ అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ గాలి స్తోంది. ఈ బృందం కళ్లుగప్పి ఆరుగురు నింది తులు గురువారం కోర్టులో లొంగిపోయారు. ఏమార్పు నిందితులకు సంబంధించిన సమాచారం పోలీసుల వద్ద ఉన్నట్టు తెలిసింది. వీరు లొంగిపోనున్నారనే సమాచారంతో మధ్యవర్తులు విధిం చిన షరతులకు పోలీసులు అంగీకరిం చినట్లు చెబుతున్నారు. నిందితులు నేరుగా వచ్చి తమ వద్ద లొంగిపోతారనే ధీమాతో పోలీసులు ఉన్నారు. ఎలాగు వచ్చి లొంగిపోతారనే ఉద్దేశంతో సిట్ బృందం వీరిపై పెద్దగా దృష్టి సారించలేదు.ఈ క్రమంలో ముందుగా ఇచ్చిన మాటకు విరుద్ధంగా కోర్టులో లొంగిపోవడంతో పోలీసులు ఖిన్నులయ్యారు. ఈ అంశంపై మధ్యవర్తుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన పోలీసులు.. మిగిలిన వారినైనా పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. -
పింఛన్ రావాలన్నా.. ఆహార భద్రత కార్డు అందాలన్నా..
ధరఖాస్తులు ఆహారభద్రత కార్డు, పింఛన్లకు ఉన్న డిమాండ్‌ను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ‘పింఛన్ రావాలన్నా.. ఆహార భద్రత కార్డు అందాలన్నా.. మాకు కొంత ముట్టజెప్పితే మేము సిబ్బంది చేతులు తడుపుతాం. ఇక మీ దరఖాస్తుకు ఢోకా ఉండదు. మీకు కావాల్సింది వచ్చి తీరుతుంది.’ అంటూ దళారులు దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు. రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకు దండుకుంటున్నారు. వారి మాయలో పడి పలువురు జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. సాక్షి, ఖమ్మం: ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం ప్రభుత్వం చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ దళారుల జేబులు నింపుతోంది. పింఛన్ సొమ్మును ప్రభుత్వం పెంచడంతో లబ్ధిదారులు ఐదారు సార్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఇటువంటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దళారులు పింఛన్లు ఇప్పిస్తామంటూ అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో తెల్లరేషన్‌కార్డులు 7,07,130, అన్నపూర్ణ కార్డులు 1,644, వృద్ధాప్య 1,20,084 , వితంతు 94,084 , వికలాంగుల పింఛన్లు 27,918 ఉన్నాయి. రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు, పింఛన్ల కోసం నూతనంగా కార్డులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15 వరకు తొలుత గడువు పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తడంతో ఈ తేదీని 20వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే రేషన్, పింఛన్ లబ్ధిదారులు ఒక్కొక్కరు ఐదారు దరఖాస్తులు ఇచ్చారు. జిల్లాలో దరఖాస్తులు ప్రభుత్వ కార్యాలయాల్లో గుట్టలుగా పేరుకుపోయాయి. వీటిని పరిశీలించటం అధికారులకు తలనొప్పిగా మారింది. తమకు పింఛన్ అందుతుందా..?, ఆహార భద్రత కార్డు వస్తుందా..? అసలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. వారిని కొంతమంది దళారులు తమ బుట్టలో వేసుకుంటున్నారు. ఇప్పటికే పట్టణాల్లోని వార్డుల్లో చోటామోటా నేతలు, పల్లెల్లో కొంతమంది దళారులు ఈ దరఖాస్తులను అర్హుల వద్ద నుంచి తీసుకొని మండల కార్యాలయాల్లో ఇచ్చారు. పింఛన్ రావాలన్నా, ఆహార భద్రత కార్డు అందాలన్నా తమకు కొంత ముట్టజెప్పితే.. సిబ్బంది చేయి తడుపుతామని ఇక ఢోకా ఉండదని దరఖాస్తుదారులను మభ్యపెడుతున్నారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకు.. ప్రభుత్వం వచ్చేనెల నుంచి రూ.వెయ్యి పింఛన్ ప్రకటించింది. ఆహార భద్రత కార్డును కేవలం రేషన్‌కే పరిమితం చేయడం, పింఛన్‌తో ఎక్కువ లబ్ధి చేకూరనుండటంతో ఇప్పుడు లబ్ధిదారులు దానిపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, పాల్వంచ ప్రాంతాల్లో కొంతమంది దళారులు.. ‘మీకు పింఛన్ ఇప్పిస్తాం.. రూ.500 నుంచి 1000 వరకు ఇవ్వాలి’ అని దరఖాస్తుదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. లబ్ధిదారులు కూడా గుట్టలుగా దరఖాస్తులు రావడంతో తమ దరఖాస్తు పరిశీలనకు వస్తుందో లేదోననే ఆందోళనతో డబ్బులు ముట్టజెప్పుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తాము చెప్పినట్లుగా నడుస్తుందని, పింఛన్ జాబితాలో మీ పేరు ఉండడం ఖాయం’ అని దరఖాస్తుదారులను లబ్ధిదారులు మభ్యపెడుతున్నారు. గడువు ముగుస్తుందా..? నిరంతరమా..? తొలుత ఈనెల 15 వరకు గడువు అన్నారు. దాన్ని 20వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం రెండోసారి పెంచిన గడువు సోమవారంతో ముగియనుంది. ఈనెల 2లోగా ముందుగా పింఛన్ దరఖాస్తులు పరిశీలన పూర్తిచేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ గజిబిజి ప్రకటనలతో లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. దరఖాస్తులు నిరంతర ప్రక్రియ అని చెప్పడంతో కొంతమంది ఇప్పటి వరకు అర్జి చేసుకోలేదు. వచ్చేనెల 8న నూతన పింఛన్లు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తులకు ఎగబడుతుండగా.. దరఖాస్తు చేసుకున్న వారిని మాత్రం దళారులు అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆహార భద్రత కార్డుల పరిశీలనను పక్కన పెట్టిన అధికారులు ప్రస్తుతం పింఛన్ల దరఖాస్తుల పరిశీలనలో మునిగారు. దళారులను నమ్మి డబ్బు ముట్టజెప్పిన వారు తమకు పింఛన్ వస్తుందా..? అని ఆందోళన చెందుతుండగా.. పరిశీలన పారదర్శకంగా జరగాలని లబ్ధిదారులు కోరుతున్నారు.