
పోలీస్ ఇమేజ్‌ను పెంచండి
సాక్షి ప్రతినిధి, విజయనగరం ః ‘పోలీస్ ఇమేజ్‌ను పెంచే విధంగా అధికారులు నడుచుకోవాలి. శాంతిభద్రతలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్రమతతంగా ఉండాలి. అధునాతన టెక్నాలజీని వినియోగించుకుని నేర పరిశోధన చేయాలి.’ అని జిల్లా పోలీస్
అధికారులకు డీజీపీ జే.వీ.రాముడు సూచించారు. కొత్తగా నిర్మించిన జిల్లా ఆర్మడ్ రిజర్వు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన సోమవారం రాత్రి అదే కార్యాలయంలో సమీక్ష చేశారు. జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్, అడిషనల్ ఎస్పీలు ఎ.వి.రమణ, రాహుల్‌దేవ్ శర్మ, డీఎస్పీలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. సీతానగరం మండలం లచ్చయ్యపేటలో ఉన్న ఎన్‌సీఎస్ సుగర్ ప్యాక్టరీ సమస్యను, కార్మికుల చేపట్టిన ఆందోళన, తీసుకున్న చర్యలను ఎస్పీ వివరించారు.
అలాగే, గరివిడిలో మూతపడిన ఫేకర్, మెరకముడిదాం మండలంలో మూతపడిన ఆంధ్రా ఫెర్రో అల్లాయీస్ పరిశ్రమల విషయాన్ని కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమలు మూతపడిన నేపథ్యంలో తీసుకున్న శాంతిభద్రతల చర్యలు వివరించారు. అలాగే, అరబిందో ఫార్మా పరిశ్రమలోని కార్మికుల వివాదాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. కొన్ని రోజులగా కార్మికులు చేస్తున్న ఆందోళ, నిరసన కార్యక్రమాలను వివరించారు. ఈ విధంగా జిల్లాలో ఉన్న పలు సమస్యలతో పాటు వాటిపై తీసుకున్న చర్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న నేరాలు, వాటి దర్యాప్తు ప్రగతిని తెలియజేశారు. కొన్నింటిపై డీజీపీ సమీక్ష చేసిృట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు ఇమేజ్ పెంచేలా అధికారులు కృషి చేయాలన్నారు.
పజలతో సత్సంబంధాలు నెరపాలని, ఫిర్యాదుదారులపై సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. అధునాతన టెక్నాలజీని వినియోగించృుకుని నేర పరిశోధన చేయాలన్నారు. ఆ మేరకు అందరూ అప్‌డేట్ కావాలన్నారు. ఈ విధంగా చేస్తేనే కేసుల విచారణలో పురోగతి సాధించ వచ్చన్నారు. పోలీసుల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని, అధికారులందరికీ సరిపడా వాహనాలు వస్తాయని తెలిపారు. మావోయిస్టుల విషయమై కూడా ఈ సందర్భంగా చర్చించారు. జిల్లాలోని మావోయిస్టు ప్రాంతాలను, సంచరిస్తున్న దళాలు, నాయకత్వం వహిస్తున్న వారి వివరాలను తెలుసుకున్నట్టు సమాచారం.