మళ్లీ ఆడపిల్ల పుట్టిందని.. | police to counciling in husband | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..

Published Sat, May 21 2016 9:15 AM | Last Updated on Sat, Aug 11 2018 8:18 PM

మళ్లీ ఆడపిల్ల పుట్టిందని.. - Sakshi

మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..

భర్త పేచీ.. పోలీసుల కౌన్సెలింగ్‌తో రాజీ
బుచ్చిరెడ్డిపాళెం : ఆడపిల్ల పుట్టిందని భార్యతో పేచీ పెట్టుకుని వేధిస్తున్న భర్తకు పోలీసులు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వివరాలు.. మినగల్లుకు చెంది న పెంచలయ్య కుమార్తె సునీతకు సంగం మండలం పడమటిపాళేనికి చెందిన మస్తాన్‌బాబుతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ల క్రితం ఈశ్వర్‌తేజ అనే కుమార్తె పుట్టింది. మళ్లీ రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టింది. 6 నెలలు గడిచిన మస్తాన్‌బాబు  కుమార్తెను చూసేందుకు వెళ్లలేదు. పెద్ద కుమార్తె తన వద్ద ఉంటుందని, రెండో పాపతో రావద్దని భర్త చెబుతున్నాడని సునీత ఎస్పీ గ్రీవెన్స్‌లో సోమవారం పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి  సునీత దంపతులకు సీఐ వెంకటేశ్వర్లు  కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో దంపతులిద్దరూ రాజీపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement