అన్నదాతలు, డ్వాక్రా మహిళల ఆగ్రహ జ్వాల
విశాఖ : ఆంధ్రప్రదేశ్లో ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ పూరించిన సమరశంఖం విజయవంతమైంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వ వ్యతిరేకతను స్పష్టంగా తెలియజేశారు. చంద్రబాబు ఆరు నెలల పాలనపై ప్రజాగ్రహం ఏ స్ధాయిలో ఉందో ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌సీపీ చాటిచెప్పింది.
పోలీసుల ఆంక్షలు, నిర్భందాలు, తప్పుడు కేసులు, అడ్డగింతలు, బెదిరింపులను ప్రజానీకం ఏవీ లెక్కచేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకిచ్చిన హమీల అమలుపై ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పూరించిన సమరభేరి విజయవంతం అయింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు జరిగిన వైఎస్‌ఆర్‌సీపీ ధర్నాలకు విశేష స్పందన లభించింది.
చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హమీకూడా అమలుకాకపోవడంతో ఆయా వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అన్ని జిల్లాల్లో జనం పోటెత్తారు. ఊరూ వాడా...పల్లె, పట్టణం తేడా లేకుండా జనం స్వచ్ఛందంగా రోడ్లెక్కారు. బాబు సర్కర్‌పై నిప్పులు చెరిగారు.
అనేక ప్రాంతాల్లో అన్నదాతలు, డ్వాక్రామహిళలు, పెన్షన్‌లు కోల్పోయిన ప్రజలంతా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు. అబద్దపు హమీలతో తమను నిట్టనిలువునా ముంచేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. తమ సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం పోరాడుతున్న తీరును ప్రతి ఒక్కరూ అభినందించారు.
ఈ ప్రజాగ్రహం ఒక్క హెచ్చరిక మాత్రమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ప్రజలకిచ్చిన వాగ్ధానాలు నెరవేర్చకపోతే తీవ్ర ఉద్యమాలు తప్పవని వైఎస్ఆర్‌సీపీ నేతలు హెచ్చరించారు.మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుడుతోంది.