
క్రీడల్లో రాజకీయ జోక్యం వద్దు
దయచేసి ఎవరూ క్రీడల్లో రాజకీయ జోక్యం చేసుకోవద్దని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
గుంటూరు: దయచేసి ఎవరూ క్రీడల్లో రాజకీయ జోక్యం చేసుకోవద్దని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ వివాదంపై విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికను ఐఓఏ అధికారికంగా ఆమోదించిందని చెప్పారు. తాను అమెరికాలో పెరిగానని.. చాలా క్రీడల్లో తనకు అనుభవం ఉందని తెలిపారు. తాను జాతీయ క్రీడాకారుడిని కూడా అని చెబుతూ.. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని అన్నారు.