చిత్తూరు జిల్లా పుత్తూరు వద్ద రూ.3 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు పట్టుకున్నారు. పుత్తూరు చెక్‌పోస్టు వద్ద మంగళవారం అర్థరాత్రి అటవీ అధికారులు తనిఖీలు చేస్తుండగా ఒక టాటా ఇండికా కారు ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో అధికారులు కారును వెంబడించారు. అయితే, పరమేశ్వర మంగళం వద్ద కారును స్మగ్లర్లు వదిలేసి వెళ్లిపోయారు. దీంతో కారు సహా అందులోని రూ.3 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు రేంజి అధికారి రెడ్డప్ప తెలిపారు.