
ఏప్రిల్ నుంచి ఏపీలో విద్యుత్ వాత మొదలు..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్సీ) వెల్లడించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం..రాష్ట్రంలో సుమారు రూ.1088 కోట్ల మేర ఛార్జీల పెంపుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఛార్జీల పెంపుకు అనుమతి ఇవ్వనున్నట్లు ఈఆర్సీ తెలిపింది. ఛార్జీల పెంపు ఈ విధంగా ఉండబోతోంది..0 నుంచి 100 యూనిట్ల వరకు పాత ఛార్జీలనే కొనసాగించనున్నారు. 100 యూనిట్లు దాటిన వాటికి యూనిట్ కు 4 నుంచి 5.7 శాతం వరకు పెంచనున్నారు. ఈ సవరించిన విద్యుత్ ఛార్జీలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి.