వైఎస్సార్‌సీపీ బాపట్ల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నందిగం సురేష్‌తో త్రోబాల్ క్రీడాకారుడు చావలి సునీల్
ప్రజా సంకల్పయాత్ర బృందం: త్రోబాల్ క్రీడలో భారతదేశం తరఫున కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి బంగారు పతకాలు సాధించిన గుంటూరు జిల్లా కొల్లిపరకు చెందిన నిరుపేద యువకుడు చావలి సునీల్‌కు ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని వైఎస్సార్‌సీపీ బాపట్ల వైఎస్సార్ సీపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు నందిగం సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన సునీల్‌ను వెంట పెట్టుకుని వచ్చి యలమంచిలిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఇప్పటి వరకు సునీల్ వివిధ రాష్ట్రాల్లో బంగారు పతకాలు సాధించడమే కాకుండా 2012 నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలను ఓడించి వరుస విజయాలతో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సెప్టెంబర్‌లో థాయ్‌లాండ్‌లో జరగనున్న త్రోబాల్ పోటీలకు ఎంపికైనా అక్కడకు వెళ్లేందుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయన్నారు. అత్యాధునిక సదుపాయాలతో క్రీడా మైదానాలు, క్రీడల్లో దేశంలోనే నంబర్ వన్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామంటున్న ప్రభుత్వం సునీల్ వంటి క్రీడాకారులను ప్రోత్సహించడంలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఇలాంటి బంగారు భవిష్యత్ ఉన్న క్రీడాకారులకు అండగా నిలబడాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment