రేపు, ఎల్లుండి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్‌ | Prakasam Barrage repaired Tomorrow and day after Tomorrow, says Irrigation Engineers | Sakshi
Sakshi News home page

రేపు, ఎల్లుండి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్‌

Published Fri, Jun 20 2014 3:04 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

Prakasam Barrage repaired Tomorrow and day after Tomorrow, says Irrigation Engineers

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం నిర్ణయించారు. ఈ నేపథ్యంలో శనివారం, ఆదివారం ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రతి ఏడాది ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు నిర్వహిస్తారు. అలాగే బ్యారేజీ వద్ద పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వీటితోపాటు రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నారు.

 

అధికారులు, కార్మికులు రెండు రోజుల పాటు శ్రమించి బ్యారేజీ పనులు పూర్తి చేయనున్నారు. దాంతో సోమవారం ఉదయం నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు సాగిస్తారు. అయితే గుంటూరు - విజయవాడ నగరాల మధ్య రాకపోకలు ప్రకాశం బ్యారేజీపై మీదగా నుంచి కాకుండా దుర్గమ్మవారధి మీదగా సాగనున్నాయి. దాంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement