స్కూల్లో విద్యార్థినులతో అసభ్యకర నృత్యాలు
పామిడి: ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నిర్వాకం అనంతపురం జిల్లా పామిడిలో గత కొన్ని రోజులుగా జరుగుతోందని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి... పామిడిలోని ఓ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.
తమతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ బాధిత విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాలపై పోలీసులకు ఫిర్యాదు చేయకుండా స్కూలు యాజమాన్యం అడ్డుపడుతోందని కూడా విద్యార్థినులు వాపోయారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.