రాష్ట్ర విభజన కారణంగా తలెత్తే పరిణామాలు తీవ్రంగానే ఉండబోతున్నారుు. ఖర్చులు పెరగనున్నారుు. అందుకు తగ్గట్టుగా ఆదాయం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే జనమంతా కష్టాల్లో ఉన్నారు. వ్యవసాయం సహా ఉత్పత్తి రంగాలన్నీ నష్టాల ఊబిలో చిక్కుకున్నారుు. సంక్షేమ పథకాలు పడకేశారుు. పాలన గాడి తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగారుు. కొత్త పాలకులొచ్చారు. త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత పరిస్థితులను చక్కదిద్దాల్సిన బాధ్యత వారి భుజస్కంధాలపైనే ఉంది. వాళ్లేంచేస్తారు. ఈ సవాళ్లను అధిగమించగలుగుతారా. చేతులెత్తేసి ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టేస్తారా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.
సాక్షి, ఏలూరు : ఎన్నికల్లో గెలిచి కొత్తగా పదవులు చేపడుతున్న ప్రజాప్రతినిధులకు పాలన కత్తిమీద సాము కానుంది. ఎన్నో ఏళ్లుగా గ్రామ స్థాయినుంచి జిల్లాస్థాయి వరకూ పరిపాలన కుంటుపడింది. మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుతోపాటు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాబడిపై కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. కేంద్రం ఇచ్చే రాయితీలు, నిధులు ఎప్పుడు అందుతాయనే దానిపై స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో స్థానిక నిధులతోనే సౌకర్యాలు మెరుగుపర్చుకోవాలి. అవసరాలు తీర్చుకోవాలి. ఇదంతా కొత్త పాల కుల పనితీరుపైనే ఆధారపడి ఉంది. సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీ వరకూ ప్రతీ నాయకుడు ప్రజా సమస్యలను సవాళ్లుగా స్వీకరించక తప్పదు.
ఆర్థిక వ్యవస్థ తిరోగమనం
జిల్లాలో పాలన పడకేయడంతో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాటపట్టింది. ప్రభుత్వ విభాగాల ఆదాయాలు గణనీయంగా తగ్గాయి. చాలావరకూ బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఆర్టీసీ, గనులు, విద్యుత్, పురపాలక, ఎక్సైజ్, వ్యవసాయ శాఖలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 884 పంచాయతీల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. కేవలం రూ.60 కోట్లకే పరి మితమైంది. ఏలూరు నగరం, ఎనిమిది మునిసిపాలిటీలు భారీగా ఆర్థిక లోటులో కూరుకుపోయూరుు. వీటికి రావాల్సిన రూ.60కోట్ల ఆదాయానికి గండిపడింది. జిల్లాలో దాదాపు 80 శాతం జనాభా సేద్యంపైనే ఆధారపడి బతుకుతున్నారు. రైతులు నాలుగేళ్లు నుంచి వరుసగా పంటల్ని నష్టపోతున్నారు. ఇప్పటివరకూ దాదాపు రూ.1,500 కోట్ల విలువైన పంటలు కోల్పోయారు. వ్యవసాయానికి రోజుకు 7గంటలు ఉచిత విద్యుత్ ఇప్పటికీ అందడం లేదు.
భారం ఇంతింత కాదయూ...
జిల్లాలో ద్విచక్ర వాహనాలు సుమారు 5లక్షల వరకు ఉన్నాయి. ట్రక్‌లు, ఆటోల సంఖ్య 12వేల 415. వీటికితోడు 20వేల కార్లు ఉన్నాయి. లారీలు, బస్సుల సంగతి సరేసరి వీటి అవసరాలకు రోజుకు 5లక్షల లీటర్ల వరకూ పెట్రోల్ వినియోగం అవుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి నెలా పెరుగుతూనే ఉన్నారుు. ఇది ప్రత్యక్షంగా వాహనదారులకు భారంగా పరిణమించగా.. రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు ఇదో కారణమైంది. బియ్యం, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంతో పోలిస్తే బియ్యం ధర బస్తాకు దాదాపు రూ.200 పెరిగింది. జిల్లాలో 48 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో దాదాపు రూ.7.4 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సిలిండర్ ధర రూ.425కు పెరిగింది. బ్లాక్ మార్కెట్‌లో రూ.850 నుంచి రూ.1,050 వరకూ విక్రయిస్తున్నారు. పండగ వేళ రూ.1,200 నుంచి రూ.1,500 పెట్టనిదే గ్యాస్ దొరకదు. ధరల్ని తగ్గించడంతో పాటు బ్లాక్‌మార్కెట్‌ను నిరోధించాల్సింది. జిల్లాలో 11, 81,672 మంది విద్యుత్ వినియోగదారులపై ఏటా చార్టీల భారం పెరుగుతోంది.
భరోసా ఇవ్వగలరా!
జిల్లా ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా 100 రోజులకుపైగా ఉద్యమం చేశారు. పిల్లల చదువులకు, ఉద్యోగాలకు దారేదని కన్నీరు పెట్టుకున్నారు. వారికి భరోసా ఇచ్చేలా కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పన ఉండాలి. జిల్లాలోని పేదలకు గూడు లేదు. ఇళ్లు పొందిన కొందరికి వాటిపై హక్కులేదు. ఇళ్లకు పక్కా డాక్యుమెంట్లు ఇవ్వడంతోపాటు వాటిపై పావలా వడ్డీకే రుణాలు కూడా ఇవ్వాలని పేదలు కోరుతున్నారు. పేదలు కార్పొరేట్ ఆస్పత్రుల మెట్టు ఎక్కేలా చేసిన ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతుందా లేదా అనే భయం ప్రజల్లో ఏర్పడింది. వారికి ధైర్యాన్నివ్వాలి. అన్నిటికంటే ముఖ్యంగా అవినీతి లేని పారదర్శక పాలనను ప్రజలు కోరుకుంటున్నారు. కొత్త పాలకులు వీటిపై దృష్టిసారించి ప్రాధాన్యతా రంగాలను గాడిన పెడితే తప్ప ప్రజలు కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు.
కత్తిమీద సాము
Published Tue, May 20 2014 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:34 AM
Advertisement
Advertisement