ఎక్కడి ధాన్యం అక్కడే | Rain effects to paddy | Sakshi
Sakshi News home page

ఎక్కడి ధాన్యం అక్కడే

Published Thu, May 22 2014 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM

ఎక్కడి ధాన్యం అక్కడే

ఎక్కడి ధాన్యం అక్కడే

 నిండామునుగుతున్న మహిళా సంఘాలు
 
 సాక్షి, హైదరాబాద్: ధాన్యం తరలింపులో పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇందిర క్రాంతి పథం (ఐకేపీ) మహిళా సంఘాలు తీవ్రంగా నష్టపోతున్నారుు. ఐకేపీ సంఘాలు సేకరించిన ధాన్యాన్ని సకాలంలో తరలించడంలో అధికారులు విఫలం కావడంతో లక్షల సంఖ్యలో ధాన్యం బస్తాలు సేకరణ కేంద్రాల్లో పేరుకుపోయూరుు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వేల సంఖ్యలో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యూరుు. మరోవైపు ధాన్యం మిల్లులకు తరలించడంలో జరుగుతున్న జాప్యం వల్ల సంఘాలు రైతుల నుంచి సేకరించినప్పుడు ఒకరకమైన తూకం ఉంటే.. అవి మిల్లులకు చేరేసరికి మరో రకమైన తూకం నమోదవుతోంది. తూకంలో గణనీయమైన తగ్గుదల కారణంగా వాటిల్లుతున్న నష్టాన్ని మహిళా సంఘాలే భరించాల్సి వస్తోంది. మరోవైపు వర్షాల కారణంగా ధాన్యం రంగు మారుతుండటంతో సరైన ధర లభించక ఐకేపీ సంఘాలు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. గతంలో ప్రభుత్వం ధాన్యం బస్తాలను కప్పేందుకు టార్పాలిన్ షీట్లు అందజేయడంతో పాటు తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉంచడం, ఇతరత్రా సదుపాయూలు కల్పించేది. కానీ పౌరసరఫరాల శాఖ ఇప్పుడలాంటి ఏర్పాట్లేవీ చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని, తమకు వచ్చే కమీషన్ మాటేమో కానీ మొదటికే మోసం వస్తోందని మహిళా సంఘాలు వాపోతున్నారుు.
 
 నిలిచిన తూకాలు.. నట్టేట్లో మహిళలు
 
 దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అరుున తొలినాళ్లలో ఐకేపీ మహిళా సంఘాల ఏర్పాటుకు చొరవ తీసుకున్నారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడంతో పాటు గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి సంఘాలు దోహదపడతాయని ఆయన భావించారు. ఈ మేరకు ఏటా ధాన్యం సేకరణ జరుపుతున్న మహిళా సంఘా లు తాము సేకరించిన మొత్తానికి 2% వరకు కమీషన్‌ను తీసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. మహిళా సంఘాలు సేకరించే ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ ప్రధానంగా మిల్లర్లకు, అలాగే భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు తరలిస్తుంది. వారి నుంచి వచ్చే మొత్తాన్ని ఐకేపీలకు చెల్లిస్తే.. ఐకేపీలు రైతులకు చెల్లింపులు చేస్తారుు. కానీ ఇటీవలి కాలంలో పౌరసరఫరాల శాఖ వైఖరి వారిని నష్టాలపాలు చేస్తోంది. ఈ ఏడాది మహిళా సంఘాలు ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, చిత్తూరు, కృష్ణా తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున ధాన్యం సేకరణ ప్రారంభించారుు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. అందులో 3.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ తరలించింది. అరుుతే దాదాపు పక్షం రోజులుగా ఈ ధాన్యం తరలింపు ప్రక్రియ మరీ మందగించడంతో మహిళా సంఘాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సుమారు 50 వేల మెట్రిక్ టన్నులు అంటే దాదాపు 6.8 లక్షల బస్తాల ధాన్యం ఇంకా సేకరణ కేంద్రాల్లోనే నిల్చిపోయింది. ఒక్క నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, వేములపల్లి, దామరచర్ల, నిడమనూరు మండలాల్లోని పలు ఐకేపీ కేంద్రాల్లోనే సుమారు రెండు లక్షల ధాన్యం బస్తాల తరలింపు నిలిచిపోరుుంది. గోనె సంచులు, వాహనాల కొరత కారణంగా తూకాలు నిలిచిపోరుునట్టు మహిళలు చెబుతున్నారు. నిజామాబాద్‌తో పాటు పలు ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఆ ధాన్యాన్ని కాపాడుకోవడానికి మహిళలు ధాన్యం సేకరణ కేంద్రాల్లోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. తమ ధాన్యాన్ని సత్వరమే తరలించాల్సిందిగా వారు అధికారులను కోరుతున్నా సహకరించడం లేదని సమాచారం.
 
 ఆదుకునేవారేరీ..
 
 జిల్లా అధికారుల అజమాయిషీ లేకపోవడంతో మిల్లర్ల ఇష్టారాజ్యంగా సాగుతోందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికారుల వైఖరితో తాము రైతులకు సకాలంలో డబ్బు చెల్లించలేక పోతున్నామని, దీనితో రైతుల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతోందని వాపోతున్నాయి. మొదట్లో లాభసాటిగా అనిపించిన ధాన్యం సేకరణలో క్రమేణా కష్టాలు ఎక్కువ వుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుు. సేకరణ కేంద్రాల ద్వారా మహిళా సంఘాలు దాదాపు రూ.500 కోట్లకు పైగా విలువైన ధాన్యం సేకరిస్తే.. రైతులకు ఇంకా రూ.281 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎఫ్‌సీఐ నుంచి వందల కోట్లలో అడ్వాన్సు తీసుకుంటున్న రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ రైతులకు మాత్రం సకాలంలో చెల్లించడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం కూడా లేకపోవడంతో దీనిపై దృష్టిపెట్టే వారే కరువయ్యారు.
 
 మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు..
 
 రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లు వెంటవెంటనే దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో వేలాది బస్తాలు కొనుగోలు కేంద్రం వద్దే ఉండిపోతున్నారుు. ఈ కారణంగా రైతుల నుంచి ధాన్యం సేకరణ వీలు కావడం లేదు. అధికారులు వెంట వెంటనే ధాన్యం తరలించే విధంగా చూడాలి.     - గండమల్ల సుజాత,     ఈటూరు (నల్లగొండ)
 
 తడిసిన ధాన్యంతో నష్టపోతున్నాం..
 
 ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 200 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయింది. ఈ ధాన్యం ఆరబెట్టి తూకం వేసి మిల్లర్‌కు తరలించాం. ఇందులో సుమారు ఇరవై క్వింటాళ్ల మేరకు తూకంలో నష్టం వచ్చింది. రైతులకేమో ప్రభుత్వం నిర్ణయించిన ధర చెల్లించాం. దీంతో మాకు నష్టం వస్తోంది.     
 - నీలిమ, కోలి హనుమాన్ మహిళా సమాఖ్య,     ఆర్మూర్ (నిజామాబాద్)
 
 మిల్లర్లు కొనడం లేదు..
 
 రైతుల వద్ద నుంచి తడిసిన ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1,365 చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నాం. కానీ ఈ ధాన్యం తీసుకునేందుకు రైస్ మిల్లర్లు వెనుకాడుతున్నారు. దీంతో మాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
 
 - డి.లక్ష్మి, కోలి హనుమాన్ మహిళా సమాఖ్య, ఆర్మూర్ (నిజామాబాద్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement