బేల, న్యూస్‌లైన్ : మరాఠీ మీడియం విద్యార్థులపై ఆర్వీఎం ఉన్నతాధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వచ్చే రెండో తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అర్ధ సంవత్సరం (సంగ్రహణాత్మక-2) పరీక్షలు ప్రారంభం కానుండగా మరాఠీ మీడియం పాఠశాలల్లోని 6, 7, 8వ తరగతుల ప్రశ్నపత్రాలను ఆర్వీఎం సరఫరా చేయలేదు. పెపైచ్చు ఆయూ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులే ప్రశ్నపత్రాలు తయూరు చేసుకోవాలని హుకుం జారీ చేయడం విమర్శలకు దారితీస్తోంది.
బేల మండల కేంద్రంతోపాటు కోగ్దూర్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌లు, బెదోడ, దహెగాం, కొబ్బాయి, సోన్‌కాస్ గ్రామాల్లో ప్రాథమికోన్నత మరాఠీ మీడియం పాఠశాలలు ఉన్నాయి.
మండలంలోని తెలుగు, ఉర్దూ మీడియం 6, 7, 8వ తరగతుల అర్ధ సంవత్సర పరీక్షల నిర్వహణకు ఇప్పటికే రాజీవ్ విద్యామిషన్ నుంచి మండల కేంద్రంలోని ఎమ్మార్సీకీ ప్రశ్నపత్రాలు సరఫరా అయ్యాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా సీఆర్పీలు, ఆయా ప్రధానోపాధ్యాయులకు ప్రశ్నపత్రాలు పంపిణీ చేస్తున్నారు. కానీ మరాఠీ మీడియం ప్రశ్న పత్రాలు ఇంకా సరఫరా రాలేదు. మరో నాలుగు రోజుల్లో పరీక్షలు ఉన్నారుు. ఈ ప్రశ్నపత్రాల కోసం శనివారం స్థానిక ఎమ్మార్సీలో సంప్రదిస్తే.. ‘మమ్మల్నే తయారు చేసుకోవాలని ఇప్పుడు చెబుతున్నారు..’ అని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ఏటా రాజీవ్ విద్యామిషన్ నుంచే ఈ ప్రశ్నపత్రాలు వస్తాయని, ఈ సారే కొత్తగా నిలిపివేయడం సరికాదని ఉపాధ్యాయులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఈ తరగతులకు ప్రింటెడ్ ప్రశ్నపత్రాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, పోషకులు, విద్యార్థులు కోరుతున్నారు.
స్థానికంగా అరుుతే జిరాక్స్‌లే..
ఈ ప్రశ్న పత్రాలను స్థానికంగా తయారు చేసుకుంటే విద్యార్థులకు సరిపడా జిరాక్స్‌లను మార్కెట్‌లో తీసుకోవాల్సిందే. ఈ జిరాక్స్ ప్రశ్న పత్రాలు మార్కెట్‌లో లభిస్తే.. పరీక్షల నిర్వహణ ఉత్తుత్తిగా మారనుందని, అలాంటప్పుడు పరీక్షలు నిర్వహించడం దేనికని పోషకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి ఎంఈవో సదుల చంద్రప్రకాశ్‌ను వివరణ కోరగా.. 6, 7, 8 తరగతుల మరాఠీ మీడియం సంగ్రహాత్మక పరీక్షలకు ప్రశ్నపత్రాలు సరఫరా కాలేదన్నారు. వీటిని ఆయూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తయారు చేసుకోవాలని రాజీవ్ విద్యామిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు.
ప్రశ్నపత్రాలు.. ప్రశ్నార్థకం?
Published Sun, Dec 29 2013 5:09 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM
Advertisement
Advertisement