హైదరాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం విజయ్‌నగర్ కాలనీలో హిందూ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని సమాధి చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో భరద్వాజ అంత్యక్రియలు జరిగాయి.
అంతకుముందు విజయ్‌నగర్ కాలనీలో స్వగృహంలో వైఎస్సార్సీపీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులులుతో పాటు పలువరు ప్రముఖులు భరద్వాజ భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రావూరి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.