ravuri
-
‘స్మార్ట్ ఫోన్ మా అబ్బాయిని అంతర్జాతీయ క్రికెటర్‌గా మార్చేసింది’
అతనికి పుట్టుకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. ఏ భాష సరిగా చదవడం రాదు... రాయడమూ పూర్తిగా రాదు. సైగలతోనే తన భావాలను వ్యక్తంచేస్తాడు. సాధారణ పాఠశాలలోనే చదివాడు. కష్టపడి డిప్లొమా పూర్తిచేశాడు. పదో తరగతి పాసైన తర్వాత తల్లి కొనిచ్చిన స్మార్ట్ ఫోన్లో చూసి తనకు ఇష్టమైన క్రికెట్ నేర్చుకున్నాడు. అంతర్జాతీయ బధిరుల క్రికెట్లో నంబర్ వన్ బౌలర్‌గా ఎదిగాడు. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ బ్యాటర్లకు ఒక చాలెంజ్‌గా మారాడు. ఇదీ.. ఎనీ్టఆర్ జిల్లా కొండపల్లికి చెందిన బధిరుల అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ నాయుడు విజయగాథ. సాక్షి, అమరావతి: కొండపల్లికి చెందిన రావూరి యశ్వంత్‌నాయుడు స్మార్ట్ ఫోన్లో చూస్తూ క్రికెట్ నేర్చుకున్నాడు. మంచి బౌలర్‌గా ఎదిగాడు. ఫోన్లో క్రికెట్ పాఠాలు నేర్చుకుంటూ ఉండగా, ఆన్లైన్లో వచి్చన చిన్న మెసేజ్ చూసి 2015లో ఢిల్లీలో సెలక్షన్స్‌కు వెళ్లాడు. అప్పుడే తొలిసారిగా బధిరుల జాతీయ జట్టు ఏర్పడటంతోపాటు యశ్వంత్‌కు చోటు దక్కింది. ఆ తర్వాత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. అంతకుముందు ఏపీ తరఫున మ్యాచ్‌లు ఆడాడు. అప్పులు చేసి అండగా నిలిచిన తల్లి గత ఏడాది బధిరుల క్రికెట్‌ను బీసీసీఐ దత్తత తీసుకుంది. అప్పటివరకు మ్యాచ్‌లకు వెళితే ఖర్చంతా క్రీడాకారులదే. యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు 2015లో అనారోగ్యంతో చనిపోయారు. నాటి నుంచి అతనిని తల్లి బేబి అన్ని విధాలా ప్రోత్సహించారు. కుమారుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లడానికి అప్పులు చేసి డబ్బులిచ్చారు. యశ్వంత్ 20ఏళ్ల వయసులో ఢిల్లీలో జరిగిన తొలి బధిరుల వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఆడాడు. ఆ టోరీ్నలో మనదేశం విజేతగా నిలిచింది. సాధారణ అంతర్జాతీయ పేసర్లతో సమానంగా బౌలింగ్ చేయగలిగిన యశ్వంత్ 135 జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 167 వికెట్లు తీశాడు. అయినా యశ్వంత్‌కు మ్యాచ్ ఫీజు ఉండదు. ఒక సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిస్తే రూ.1,100 ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన జట్టు మొత్తానికి రూ.లక్ష ఇచ్చారు. వరల్డ్ కప్ గెలిచిన సమయంలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచి్చన విందులో పాల్గొన్నాడు. అతని కుటుంబ సభ్యులకు ఆహా్వనం ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయారు. గతంలో యశ్వంత్‌కు రూ.5లక్షలు ఇవ్వాలని శాప్‌ను ప్రభుత్వం ఆదేశిస్తూ లెటర్ ఇచ్చినా డబ్బులు లేవన్నారు. మెక్‌గ్రాత్ నుంచి మెళకువలు.. గోకరాజు గంగరాజు సహకారంతో 2016లో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో యశ్వంత్‌కు కోచింగ్ తీసుకునే అవకాశం దక్కింది. అప్పుడే ఆ్రస్టేలియా దిగ్గజ బౌలర్ గ్లేన్ మెక్‌గ్రాత్ వచ్చారు. ఆయన యశ్వంత్ బౌలింగ్‌ని మెచ్చుకుని ఎన్నో మెళకువలు నేరి్పంచారు. స్టెయిన్ నా ఫేవరెట్.. ‘నాకు అమ్మంటే ఎంతో ఇష్టం. మా అక్క సుమ నా విజయంలో వెన్నంటే ఉంటుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ నా ఫేవరెట్. బ్యాటింగ్, కోచింగ్‌లో ద్రావిడ్‌ను చూసి ఎంతో నేర్చుకున్నా. ఈ ఏడాది ఖతార్‌లో జరగాల్సిన బధిర టీ20 వరల్డ్ కప్ వాయిదా పడింది. దాని సెలక్షన్స్‌కు వెళ్లే ముందు మంగళగిరి క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంటే కుడి మోకాలు వద్ద గాయమైంది. నాలుగు నెలలు రెస్ట్. త్వరలో బంగ్లాదేశ్‌లో ఆసియా కప్, కేరళలో సౌత్ జోన్, జమ్మూ–కశ్మీర్ డెఫ్ ఐపీఎల్‌కు సన్నద్ధమవుతున్నా.’ – సైగల ద్వారా వెల్లడించిన రావూరి యశ్వంత్ స్మార్ట్ ఫోన్ మా అబ్బాయి జీవితాన్ని మార్చింది ‘స్మార్ట్‌ఫోన్ పిల్లలను చెడగొడుతుందంటారు. మా అబ్బాయిని మాత్రం అంతర్జాతీయ క్రికెటర్‌గా తీర్చిదిద్దింది. మావాడికి పుట్టకతోనే వినికిడి లోపం. పైగా మాటలు రావు. వాడు 10వ తరగతి పాసైన తర్వాత ఒక చిన్న స్మార్ట్‌ఫోన్ కొనిచ్చా. దానిలో వీడియోలు చూస్తూ అంతర్జాతీయ బధిర క్రికెట్ బౌలర్లలో నంబర్ వన్‌గా ఎదిగాడు. ఇప్పుడు నా కొడుకు ఆటను నేను స్మార్ట్ ఫోన్లో చూస్తున్నాను.’ – బేబి, అంతర్జాతీయ క్రికెటర్ రావూరి యశ్వంత్ తల్లి -
Ravuri Arjuna Rao: కులం పేరు చెప్పాలని జైల్లో కొట్టారు
‘ఉప్పు సత్యాగ్రహంలో జైలుకెళ్లినప్పుడు కులం పేరు చెప్పని నాలాంటి వారిని పోలీసులు లాఠీలతో కొట్టారు. అయినా నా సిద్ధాంతానికి నీళ్లు వదల్లేదు. కుల మత రహిత సమాజాన్నే జీవితాంతం కోరుకుంటాను’ అంటూ నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడ్డ స్వాతంత్య్ర సమరయోధుడు, నాస్తికుడు రావూరి అర్జునరావు. వర్ణ వివక్షకు, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన యోధుడు ఆయన. నాస్తికోద్యమ నాయకుడు, గాంధేయవాది గోపరాజు రామచంద్రరావు (గోరా) పెద్ద అల్లుడు రావూరి అర్జునరావు (104) వయోభారంతో ఆదివారం హైదరాబాద్‌లో తన చిన్నకుమారుడు డాక్టర్ పవర్ నివాసంలో కన్నుమూశారు. సుమారు తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం ‘సాక్షి’తో ఆయన పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే... తొమ్మిది నెలల కఠిన కాగార శిక్ష కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వానపాముల గ్రామంలో 1918లో జన్మించాను. 1940లో సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) ముదునూరు వచ్చారు. అప్పుడే ఆయనతో పరిచయం ఏర్పడింది. నాస్తిక కేంద్రంలో అన్నే అంజయ్య సహకారంతో వయోజన విద్యా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు నా వయసు 22 ఏళ్లు. 1942లో గాంధీగారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు బళ్లారిలోని ఆలీపురం క్యాంప్ జైల్లో తొమ్మిది నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించాను. అస్పృస్యతా నివారణకు కృషి జైలు శిక్ష అనంతరం వానపాముల వచ్చి నాస్తికోద్యమ నాయకుడు గోరాతో కలిసి అస్పృస్యతా నివారణ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అప్పుడు దళితుల మధ్య కుల ద్వేషం ఎక్కువగా ఉండేది. నాలుగేళ్లు అక్కడే ఉండి రెండు కులాల్లో ఎవరి ఇంట్లో వివాహాలు జరిగినా కలిసి భోజనం చేయడం, బహు మతులు ఇచ్చి పుచ్చుకునేలా మార్పులు తీసుకొచ్చాం. ఆదర్శ వివాహాలకు ప్రాధాన్యమిచ్చాం. కులాంతర వివాహాల వల్ల సామాజిక అసమానతలు పోతాయని గోరా నమ్మేవారు. అదే ఆయనను గాంధీగారికి సన్నిహితుడిని చేసింది. గాంధీజీకి సపర్యలు జైల్లో ఉన్నప్పుడు గోరాతో నాకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తన పెద్ద కుమార్తె మనోరమను వివాహం చేసుకోవాలని ఆయన నన్ను కోరారు. ఎవరైనా మంచి వ్యక్తితో మనోరమ వివాహం చేయమన్నాను. మనోరమతో వివాహానికి నన్ను ఒప్పించారు. ఈ విషయాన్ని ఆయన గాంధీకి తెలిపారు. 1945లో మమ్మల్ని మద్రాస్ తీసుకురావాలని గాంధీజీ గోరాకు ఉత్తరం రాశారు. మనోరమతో గాంధీజీ మాట్లాడి కులాంతర వివాహాన్ని రెండేళ్ల తరువాత చేయాలని సూచించారు. నన్ను సేవాగ్రామ్‌లో ఉండి హిందీ నేర్చుకోవాలని, అందరితో పరిచయాలు పెంచుకుని మనోరమకు ఉత్తరాలు రాయాలని గాంధీజీ చెప్పారు. అలా 1946 ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి 1948 ఏప్రిల్ వరకు గాంధీజీ సేవాగ్రాం ఆశ్రమం వార్ధాలో ఉంటూ ఆయనకు సపర్యలు చేశాను. 1948లో గాంధీజీ హత్యకు గురవ్వడంతో ఆయన సమక్షంలో జరగాల్సిన నా వివాహం నిలిచిపోయింది. మహామహులే పెళ్లి పెద్దలు గాంధీజీ లేరన్న శోకం నుంచి తేరుకున్నాక వార్ధాలోని మహాత్ముడి ఆశ్రమంలోనే అదే ఏడాది మార్చి 13న హరిజన్ సేవక్ సంఘ్ అధ్యక్షుడు ఠక్కర్బాబా ఆధ్వర్యంలో ‘సత్యసాక్షి’గా ప్రభాకర్జీ మా వివాహం జరిపించారు. భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్, ఆచార్య కృపలానీ వంటి మహామహులు మా పెళ్లికి పెద్దలు. తరువాత విజయవాడ నాస్తిక కేంద్రానికి చేరుకున్నాం. 20 మందికి ఆదర్శ వివాహాలు 1953లో మా దంపతులం వానపాముల చేరుకుని కాపురం ప్రారంభించి, గాంధీ స్మారక నిధి తరఫున పని చేశాం. 1960లో గుడివాడకు మకాం మార్చాం. అక్కడే హరిజన సేవా సంఘం, బాలుర వసతి గృహం నడిపాం. ఖాదీ బోర్డులో కూడా పని చేసేవాడిని. గుడివాడ, కృష్ణా, నెల్లూరులలోని కొన్ని ప్రాంతాలలో మూఢనమ్మకాల నిర్మూలన, కుల మత రహిత సమాజ స్థాపనకు, సెక్యులర్ వ్యవస్థ నిర్మాణానికి కృషి చేశాం. సుమారు 20 మందికి ఆదర్శ వివాహాలు చేశాం. మనిషిని గౌరవించటం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. విజ్ఞానం పెరిగే కొద్దీ కులతత్వం పెరిగిపోతోంది. పూర్వం త్యాగం ఉండేది. స్వార్థం కోసమే కులతత్వం పెరుగుతోంది. ఆ బీజం నశించినప్పుడే నిజమైన నవ సమాజ స్థాపన జరిగినట్లు. విజయవాడకు రావూరి భౌతికకాయం రావూరి అర్జునరావు భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి సోమవారం విజయవాడ బెంజి సర్కిల్లోని నాస్తిక కేంద్రానికి తీసుకురానున్నారు. సోమవారమే అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రావూరి అర్జునరావుకు భార్య, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఏసీబీ వలలో మహబూబాబాద్ డీఎస్సీడీఓ
మహబూబాబాద్ రూరల్: ఏసీబీ వలకు మరో అధికారి చిక్కాడు. మహబూబాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (డీఎస్సీడీఓ) అధికారి రావూరి రాజు రూ.2 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ (బాలుర) వసతి గృహం వార్డెన్ పూనమల్ల బాలరాజు 2019 నవంబర్‌లో విధుల పట్ల నిర్లక్ష్యం చేయడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి మరిపెడ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్‌గా నియామకమయ్యాడు. 2019 నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు బాలరాజు తన సస్పెన్షన్ పీరియడ్‌కు సంబంధించిన సప్లిమెంటరీ బిల్స్ కోసం డీఎస్సీడీఓ రాజును సంప్రదించాడు. డీఎస్సీడీఓ ఆ బిల్స్ చేసి బాలరాజుకు పంపాడు. మొత్తం రూ.7 లక్షలు వార్డెన్ బాలరాజు ఖాతాలో జమ అయ్యాయి. దీంతో డీఎస్సీడీఓ ఆ బిల్స్ చేసినందుకు బాలరాజును రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాలరాజు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.2 లక్షల మొత్తాన్ని డీఎస్సీడీఓ వాచ్‌మన్ గురుచరణ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కొండపల్లి గోపాల్‌రావునగర్ కాలనీలో నివాసం ఉండే డీఎస్సీడీఓ రాజు ఇంటికి పంపాడు. అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే ఆయన ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. అక్కడి నుంచి డీఎస్‌డీఓను తన కార్యాలయానికి తీసుకెళ్లి పట్టుకున్న డబ్బులకు పరీక్షలు నిర్వహించారు. వేలిముద్రల ఆధారంగా రాజు రూ.2 లక్షల నగదును లంచంగా తీసుకున్నట్లు గుర్తించారు. డీఎస్డీఓ, వాచ్‌మన్‌ను అదుపులోకి తీసుకుని నగదును సీజ్ చేశారు. -
ఇందూరుతో ‘రావూరి భరద్వాజ’కి అనుబంధం
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ శుక్రవార రాత్రి హైదరాబాద్‌లో అకాల మరణం పొందడంతో జిల్లా సాహితీలోకం దిగ్భ్రాంతి చెందింది. భరద్వాజకు జిల్లాతో విడదీయలేని అనుబంధముంది. కొన్నినెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించింది. ఇటీవలే ఢిల్లీలో ఆ అవార్డును అందుకున్నారాయన. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి తర్వాత 23ఏళ్లకు ఆ స్థాయి గౌరవం దక్కించున్న తెలుగువాడు భరద్వాజ. జిల్లాకేంద్రంలో ఇందూరు భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు ప్రకటన తర్వాత జూన్‌లో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో రావూరిని సన్మానించారు. భరద్వాజ మృతి సాహితీ లోకానికి తీరని లోటని జిల్లా కవులు వి.పి.చందన్రావు, కందాలై రాఘవాచార్య, ఘనపురం దేవేందర్, మేక రామస్వామి, పడాల రామారావు, కాసర్ల నరేశ్‌రావు, తిరుమల శ్రీనివాస్, నరాల సుధాకర్, ఆయాచితం వెంకటేశ్వర్లు తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు. -
'రావూరి' అంత్యక్రియలు పూర్తి
హైదరాబాద్ : ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. శుక్రవారం విజయ్‌నగర్ కాలనీలో హిందూ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని సమాధి చేశారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో భరద్వాజ అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు విజయ్‌నగర్ కాలనీలో స్వగృహంలో వైఎస్సార్సీపీ నేతలు కొణతాల రామకృష్ణ, సోమయాజులులుతో పాటు పలువరు ప్రముఖులు భరద్వాజ భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.అలాగే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రావూరి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
విశాఖలో రావూరి ‘వెలుతురు చినుకులు’
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కష్టాల జ్వాలలు దహించగా, ఆ మంటలు దాటి ధగధగ్గాయమానంగా ప్రకాశించిన మేలిమి బంగారం ఆయన.. కాలమనే కళాకారుడు చిత్రరీతుల్లో తీర్చిదిద్ది, నగిషీలు పెట్టి మెరుపులు మెరిపించిన అపురూప సాహితీ ఆభరణం ఆయన.. ఆ నగ తెలుగు సాహితీమూర్తి నుదుటన తళుక్కున మెరిసింది. ఆ అమూల్యాభరణం తెలుగుతల్లికి ఎనలేని కీర్తిప్రతిష్టల వెలుగులు తెచ్చింది. బతుకుబాటలో ఎదురైన కష్టనష్టాలను ఓర్మితో సహించి, నిరుపమాన సాహితీకృషి సాగించిన దిగ్దం తుడు రావూరి భరద్వాజ చల్లిన వెలుతురు చినుకులతో ఆంధ్ర సాహితికి సువర్ణాభిషేకం జరిగింది. ఈ నిరుపమాన ప్రతిభావంతుడు శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో తుదిశ్వాస వీడిన ట్టు తెలిసిన మరుక్షణం ఆయన ఆత్మీయ స్మృతులతో విశాఖ మమేకమైంది. గతనెల 21నే విశాఖలో రావూరికి మమతానురాగాలు కలబోసిన సహృదయ సత్కారం జరిగిన ఘట్టం విశాఖ సాహితీప్రియుల మదిలో మెదిలింది. ఈ సత్కారం సంగతి అటుంచితే జీవనయానంలో అనేక బాటలు పట్టి, ఎన్నో మజిలీలు చేసిన రావూరికి విశాఖతో, ఉత్తరాంధ్రతో ప్రగాఢానుబంధమే ఉంది. రావూరి సాహితీ సృజనకు గుర్తింపుగా ఆయనకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ పురస్కారాన్ని ఇచ్చిన విశిష్టతను సొంతం చేసుకుంది. తర్వాతే ఆయనకు వివిధ యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి. విశాఖకు చెందిన లబ్ద ప్రతిష్టులు పురిపండా, రోణంకి వంటి వారెందరినో కలుసుకోవడంతో ఆయన సాహితీ ప్రతిభ మరింత వెలుగులీనింది. సుదీర్ఘ వ్యవధి తర్వాత విశాఖ వచ్చిన ఆయన ఈ అనుభవాలెన్నిటినో ‘సాక్షి’తో పం చుకున్నారు. అవమానాలే తనను తీవ్ర సాహితీ కృషి సాగించేలా ప్రేరేపించాయని చెప్పారు. ఆనాడు తాను ఎదుర్కొన్న కష్టాలను ఆర్తితో వివరించి అవన్నీ తనకు అమితమైన ప్రేరణ ఇచ్చాయని చెప్పారు. ఆనాటికీ, ఈనాటికీ తేడా వివరిస్తూ ‘అప్పుడు నేను కష్టాలు పడ్డా.. ఆ రోజులు మేలిమి బంగారం.. ఇప్పుడు నేను సుఖంగానే ఉన్నా.. ఈ రోజులు రోల్డ్‌గోల్డ్’ అని చెప్పి ఒక్క వాక్యంలో జీవితానుభవాల సారాన్ని సాంతం చిరునవ్వుతో వివరించారు. సంతాపం రావూరి మృతిపట్ల సహృదయ సాహితీ అధ్యక్ష, కార్యదర్శులు ఎల్.ఆర్ స్వామి, శేఖరమంత్రి ప్రభాకర్‌రావు, మొజాయిక్ సంస్థ కార్యదర్శి రామతీర్థ, విశాఖ సాహితీ కార్యదర్శి కావలిపాటి నారాయణరావు, జిల్లా సాంస్కృతిక మండలి సభ్యులు కొసనా, డాక్టర్ డి.వి సూర్యారావు, కొణతాల రాజు, చెన్నా తిరుమలరావులు..యూజేఎఫ్ అధ్యక్షుడు ఎంఆర్ఎన్ వర్మ సంతాపం తెలిపారు. -
రావూరికి డాక్టరేట్ ప్రదానం