యథాతథంగా అసెంబ్లీ నియోజకవర్గాలు
పాత స్థానాల ఆధారంగానే సార్వత్రిక ఎన్నికలు
నిర్ణయం తీసుకున్న ఎన్నికల సంఘం
జోరుగా సాగిన ప్రచారానికి తెర
ఊపిరి పీల్చుకున్న ప్రధానపార్టీలు
ఇక పోటీపై ఆశావహుల దృష్టి
పొత్తులు, విలీనంపై చర్చ
ఇప్పుడున్న నియోజకవర్గాల ప్రకారమే సార్వత్రిక ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆశావహులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలు పెంచాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఓఎం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. చివరకు మార్పులు లేకుండానే ఎన్నికలు జరుగుతాయని ఈసీ ప్రకటించింది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
రాష్ట్ర విభజన అనంతరం నియోజకవర్గాల ను పునర్విభజన చేస్తారన్న ప్రచారం జోరుగా జరి గింది. అయితే ఎన్నికల సంఘం ఇప్పుడున్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకే ఎలక్షన్లు నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో ఆ చర్చకు పూర్తిగా తెరపడిం ది. రాష్ట్ర విభజన బిల్లుకు రెండు రోజుల్లో స్పష్టత రా నుండగా, ఆ వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువ డే అవకాశం ఉందని అధికార యంత్రాంగానికి ఈసీ ఇప్పటికే సంకేతాలిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యం లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో తలపడేందుకు సిద్ధమవుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ‘హమ్మ య్య... పునర్విభజన లేదు’ అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
2019 వరకు
తెలంగాణ జిల్లాల్లో 119 అసెంబ్లీ స్థానాలున్నాయి. రా ష్ట్ర విభజన అనంతరం వీటిని 154కు పెంచాలని రాజ కీయ పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో జిల్లాలో కనీ సం ఒక స్థానమైనా పెరుగుతుందన్న ప్రచారం జరిగిం ది. ప్రస్తుతం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలున్నా యి. ఇందులో జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండగా ఆర్మూర్, బా ల్కొండ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూర ల్, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ ఎంపీ స్థానం పరిధిలో ఉన్నాయి.
పదికి చేరుతుందనుకుంటే
నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలను ఎన్నికల సంఘం గతనెల 17వ తేదీన ప్రకటించింది. ఆ లెక్కల ప్రకారం రెండు లక్షల పైచిలుకు ఉన్న నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాలతో పాటు తాజా ఓట్లను కలిపి మూడుకు పెంచితే నియోజకవర్గాల సంఖ్య పదికి చేరుతుందన్న చర్చ జరిగిం ది. అయితే కేంద్ర కేబినెట్ సవరణతో నియోజకవర్గ పునర్విభజన వాయిదా పడింది. దీంతో 2019 నాటికి దామాషా పద్ధతిన పునర్విభజన చేస్తే ఒక నియోజకవర్గం పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. పునర్విభజనను కేంద్ర కేబినేట్ సవరించడం... ఎన్నికల సంఘం సైతం పాత నియోజకవర్గాలకే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని శనివారం ప్రకటించడంతో ప్రధాన పార్టీల సిట్టింగ్‌లు, ఆశావహులు ఊరట చెందారు. నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఎన్నికలు వాయిదా పడే అవకాశాలుండడంతోపాటు రిజర్వేషన్లలో మార్పు, తమకు పట్టున్న ప్రాంతాలు వేరే నియోజకవర్గాల పరిధిలోకి వెళ్లడం వంటి సమస్యలు వస్తాయని ఆశావహులు ఆందోళన చెందారు. ప్రస్తుతం ఆ సమస్య దూరమైంది.
పొత్తులపై ఆందోళన
శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోవడంతో ఊపిరి పీల్చుకున్న ఆశావహ అభ్యర్థులను మరో సమస్య వేధిస్తోంది. అదే పొత్తుల వ్యవహారం. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీనమవుతుందా, పొత్తు పెట్టుకుంటుందా, టీడీపీ, బీజేపీ దోస్తీ కడతాయా అన్న అంశాలు ఆయా పార్టీల్లోని ఆశావహులను టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ఈసారి సాధారణ ఎన్నికలు చాలా మందికి ప్రతిష్టాత్మక కానున్నాయి. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటే, నాలుగుచోట్ల టీఆర్‌ఎస్, రెండేసి స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలు, ఒక స్థానంలో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు విలీనమైనా, పొత్తు పెట్టుకు న్నా సిట్టింగ్‌లకు అవకాశం లభిస్తుందా, లేదా ఆయా పార్టీల నుంచి కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తారా అన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చోట టీఆర్‌ఎస్ కీలక నేతలు టికెట్లు ఆశించే అవకాశం ఉంది. ఆర్మూర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆశన్నగారి జీవన్‌రెడ్డిని కేసీఆర్ ప్రకటించగా, అక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి టికెట్టు ఆశిస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నిజామాబాద్ అర్బన్ లేదా రూరల్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే అర్బన్‌నుంచి బస్వా లక్ష్మీనర్సయ్య, రూరల్‌నుంచి భూపతిరెడ్డి టీఆర్‌ఎస్ తరపున పోటీ చేయాల ని భావిస్తున్నారు.
కామారెడ్డి నుంచి టీఆర్‌ఎస్ సిట్టిం గ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రాతినిధ్యం వహిస్తుండ గా, ఈ స్థానానికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా లైన్‌లో ఉన్నారు. జిల్లాలో మిగతా చోట్ల కూడా ఇదే పరిస్థితి. అలాగే బీజేపీ, టీడీపీల మధ్యన పొత్తు లు కుదిరినా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ స్థానం ఆ రెండు పార్టీలకు కీలకం కానుంది. ఆయా పార్టీలనుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వారి పరిస్థితి ఏమిటి, టికెట్టు రాకపోతే వారు సహకరిస్తారా అన్న విషయాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ నిలిచిపోయినా.. పొత్తుల వ్యవహారం మాత్రం నాలుగు ప్రధాన పార్టీల ఆశావహులను ఆందోళనకు గురి చేస్తోంది.
పునర్విభజన లేదు
Published Tue, Feb 18 2014 2:45 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement