తెలంగాణ తల్లి సోనియా | telangana peoples are thankful to sonia gandhi | Sakshi
Sakshi News home page

తెలంగాణ తల్లి సోనియా

Mar 11 2014 4:54 AM | Updated on Mar 18 2019 7:55 PM

‘పొత్తు లేకుండానే జిల్లాలోని రెం డు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. టీఆర్‌ఎస్‌తో పొత్తున్నా జి ల్లాలో పార్టీకి జరిగే ప్రయోజనం అం తంతే... 2009 సాధారణ ఎన్నికల్లో రెం డు పార్లమెంట్ స్థానాలు గెలిచాం.

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
 ‘పొత్తు లేకుండానే జిల్లాలోని రెం డు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది. టీఆర్‌ఎస్‌తో పొత్తున్నా జి ల్లాలో పార్టీకి జరిగే ప్రయోజనం అం తంతే... 2009 సాధారణ ఎన్నికల్లో రెం డు పార్లమెంట్ స్థానాలు గెలిచాం. అప్పటికీ ఇప్పటికీ పోలిస్తే జిల్లాలో పార్టీ పరి స్థితి బాగా మెరుగు పడింది’ అంటూ కేం ద్ర మంత్రి జైరాం రమేశ్‌తో జిల్లా కాం గ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. టీ ఆర్‌ఎస్ పొత్తు వద్దంటే వద్దన్నారు.


 రాష్ట్ర విభజన నేపథ్యంలో అటు సీ మాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి జై రాం రమేశ్ సోమవారం జిల్లాకు వచ్చా రు. మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రమేశ్.. ఆ తర్వాత జిల్లా కేంద్రం లోని శ్రావ్య గార్డెన్స్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పా ర్టీ పరిస్థితి, స్థానిక సంస్థలతో పాటు త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయావకాశాల గు రించి తెలుసుకున్నారు.
 
  కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందన్న సంగతిని ప్రజ ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. ఇది టీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి చేసిన ప్రకటనగా జిల్లా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్ట సమితితో పొత్తు వద్దంటూ జిల్లా కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లినా తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయని కొందరు నేతలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ‘తెలంగాణ ఉద్యమాల వల్ల రాలేదు.. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చింది.. పొత్తు కోసం తెరాస నేతలను బతిమిలాడాల్సిన అగత్యం లేదు’ అని ఏకంగా నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ‘జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే శక్తి టీఆర్‌ఎస్‌కు లేదు’ అని పలువురు సీనియర్లు కేంద్ర మంత్రితో పేర్కొనడం చర్చనీయాంశమైంది. జైరాం రమేశ్ పర్యటన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తుల వ్యవహారానికి చెరుపు చేసేదిగా ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement