జగమంత సంబరం
Published Tue, Sep 24 2013 6:20 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 484 రోజుల నిరీక్షణ ఫలించింది. జగనన్న వస్తాడు...తమ కష్టాలు తీరుస్తాడన్న ఎదురుచూపులకు బదులు దొరికింది. ఆయన అభిమానులకు, పార్టీ శ్రేణులకు ఓదార్పు లభించింది.. సోమవారం ఉదయం నుంచి టీవీలకు అతుక్కుని క్షణక్షణం ఉత్కంఠగా గడిపిన వారికి సాయంత్రం చల్లని కబురందింది. అంతే అందరి కళ్లు చెమ్మగిల్లాయి... గుండెలు పుల కించాయి.... అసంకల్పితంగా చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా కరతాళధ్వనులతో తమ హర్షం ప్రటించారు.... పరస్పరం ఆలింగనాలు చేసుకున్నారు.... అభినందనలు తెలుపుకొన్నారు... రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకొన్నారు. దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్నారు. మనసు స్థిమిత పడే వరకూ తీపి ఆనందాన్ని పంచుకున్నారు.
విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి బెయిల్ మంజూరు కావడంపై జిల్లా వ్యాప్తంగా సోమవారం హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నియోజకవర్గ సమన్వయకర్తలతో పాటూ మండల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సంబరాల్లో పాల్గొన్నారు. విజయనగరంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అవనాపు విజయ్ నేతృత్వంలో పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు తదితరులు ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయం ముందు భారీ ఎత్తున మందుగుండు కాల్చారు. అలాగే పార్టీ కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని,
పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ విజయనగరం నియోజకవర్గ సమన్వయకర్త గురాన అయ్యలు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో మిఠాయిలు పంచిపెట్టి విజయోత్సవాలు చేశారు. పార్వతీపురంలో పట్టణ పార్టీ కన్వీనరు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలేశారు. ఆర్టీసీ బస్‌స్టాండ్ నుంచి మేళతాళాలలో పాతబస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు జమ్మాన ప్రసన్నకుమార్, గర్భాపు ఉదయభాను, జెడ్పీ మాజీ చైర్మన్ గులిపల్లి సుదర్శనరావుతో పాటూ కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి కోటలో పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు తూముల రామసుధీర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ బాణసంచా కాల్చారు. సాలూరులో పట్టణ నాయకులు జరజాపు సూరిబాబు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు ముందుగా పట్టణంలో ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలేశారు.
నాయకులు మిఠాయిలు పంచుకున్నారు. జాతీయ రహదారిపై బాణసంచా పేల్చారు. పాచిపెంటలో దండి ఈశ్వరరావు, ఇజ్జపురపు కృష్ణల ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. గజపతినగరం నియోజకవర్గం లక్కిడాం, గంట్యాడ, బోనంగి తదితర గ్రామాల్లో విజయోత్సవాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చారు. గజపతినగరం నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు నియెజకవర్గ సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. పెద్దినాయుడులతో పాటు కార్యకర్తలు, అభిమానులు స్థానిక జాతీయ రహదారిపై బాణసంచా కాల్చి తీపి పంచుకున్నారు. అనంతరం స్థానిక జాతీయ రహదారిపై ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహనికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాష్ట్రంలో సీమాంధ్ర తెలంగాణ అనే వ్యత్యాసం లేకుండా అన్ని చోట్లా పండగ వాతావరణం నెలకొందన్నారు. ఎస్.కోటలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ రెహ్మాన్ నేతత్వంలో స్థానిక దేవీ బొమ్మ జంక్షన్‌లో సంబరాలు నిర్వహించారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. మిఠాయిలు తినిపించారు. రంగులు పూసుకుని ఆనందం వ్యక్తం చేశారు. మేళతాళాలు, భాజాభజంత్రీలతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ మండల కన్వీనరు సత్యం, కె.పాల్‌కుమార్, పట్టణ వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు మోపాడ కిరణ్‌కుమార్‌లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
చీపురుపల్లి మూడురోడ్లు జంక్షన్‌లో నియోజకవర్గ సమన్వయకర్త శనపతి సిమ్మినాయుడు ఆధ్వర్యంలో మిఠాయిలు పంచిపెట్టుకుని బాణసంచా కాల్చారు. గుర్లలో మండల కన్వీనరు కెల్ల సూర్యనారాయణ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. చీపురుపల్లి మండలం పత్తికాయవలస గ్రామంలో మీసాల సిమ్మునాయుడు ఆధ్వర్యంలో బాణా సంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. మెరకముడిదాంలో కొమ్ము శంకరరావు ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. కురుపాం నియోజకవర్గంలో పార్టీ నాయకులు శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చారు. కురుపాం, రావాడ కూడలిలో ఉన్న వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. త్రినాథస్వామి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టారు.
గుమ్మలక్ష్మీపురం మండలంలో మండంగి భూషణరావు, పత్తిక లక్ష్మణరావు తదితర నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. గరుగుబిల్లి మండలంలో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు ద్వారపురెడ్డి సత్యనారాయణతో పాటూ బొబ్బిలి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. జియ్యమ్మవలస మండలంలో దత్తి లక్ష్మణరావుతో పాటు నాయకులు స్వీట్లు పంచుకున్నారు. నెల్లిమర్ల మండలంలో మొయిద, సతివాడ, కొండవెలగాడ, నెల్లిమర్ల తదితర గ్రామాల్లో కార్యకర్తలు, ప్రజలు రోడ్డుపైకి వచ్చి డ్యాన్సులతో సంబరాలు చేసుకొంటూ మిఠాయిలు పంచుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులే కాకుండా జిల్లా వ్యాప్తంగా చాలా మంది సంబంరాల్లో పాల్గొని తమ ఆనందాన్ని పంచుకొన్నారు.
Advertisement
Advertisement