- గణతంత్ర వేడుకల్లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు
విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన రవాణా సేవలు అందించడం ద్వారా ప్రయాణీకుల మన్ననలు అందుకోగలుగుతున్నామని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు అన్నారు. విజయవాడ బస్‌హౌస్ వద్ద మంగళవారం గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. దేశానికి రాజ్యాంగం ఉన్నట్టే ఆర్టీసీ కూడా కొన్ని గవర్నింగ్ సూత్రాల(మార్గదర్శకాలు)ను రూపొందించుకోవాలని ఉందన్నారు.
సంస్థ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన మార్గంలో ప్రగతి సాధఙంచేందుకు ఈ సూత్రాలు ఉపకరిస్తాయని చెప్పారు. మెరుగైన రవాణా సేవలందించడం ద్వారా గత ఏడాది ప్రయాణీకుల మన్ననలు అందుకోగలిగామని అన్నారు. గోదావరి పుష్కరాలు ఆర్టీసీ ప్రతిష్టను పెంచాయని, అదే స్పూర్తితో ఈ ఏడాది కృష్ణా పుష్కరాల్లోను ప్రయాణీకులకు రవాణా సౌకర్యాలు అందించాలని ఉద్యోగులకు సూచించారు.