ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం
రాజంపేట:
అంతర్జాతీయంగా విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని కర్నూలు రేంజ డీఐజీ మురళీకృష్ణ స్పష్టం చేశారు. రాజంపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పోలీసు శాఖ తీసుకున్న చర్యల ఫలితంగా స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టిందన్నారు. స్మగ్లింగ్ నిరోధానికి ప్రభుత్వం త్వరలో కఠినతరమైన చట్టాలను తీసుకొస్తుందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో ఎంతటి వారైనా ఉపేక్షించేదిలేదన్నారు. ఎర్రచందనం కేసుల్లో ఉన్న నేరస్తులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పోలీసు, అటవీ శాఖ సమన్వయంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్మగ్లింగ్‌కు సంబంధించి పాతకేసులపై సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆధారాలు లేని కేసులు విషయంలో కొంత ఆలస్యం అవుతోందన్నారు. అటవీ గ్రామాల ప్రజలు ఎర్రచందనం చెట్లు నరకడం, రవాణా చేయడంపై సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసు శాఖకు ప్రజల సహకారం తప్పని సరిగా ఉండాలన్నారు. పోలీసులు కూడా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలన్నారు. కర్నూలు రేంజ్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఈయనతో పాటు జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీ పాల్గొన్నారు. అంతకు ముందుగా పోలీసు అధికారులతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టే విధి విధానాలపై సమీక్షించారు.