ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా నియమితులైన వారికి రిజిస్టర్ ్రపోస్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కుళ్లాయప్ప తెలిపారు.
81 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకం
పాతగుంటూరు : ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా నియమితులైన వారికి రిజిస్టర్ ్రపోస్టు ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కుళ్లాయప్ప తెలిపారు.
సోమవారం స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియామక ఉత్తర్వులు అందినవారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో మార్చి ఒకటో తేదీలోపు తమ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెడికల్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఎంపికైనవారు మార్చి 18 లోపు విధుల్లో హాజరు కావాల్సి ఉంటుందన్నారు. జీతం స్కేలు రూ.7,760- రూ.23,650 వరకు ఉంటుందన్నారు. 5,046 మంది రాతపరీక్షకు హాజరయ్యారని, అందులో 81 మంది నియమితులయ్యారని వివరిం చారు. వీరి నియామకంతో సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండి, నేరాలను నివారించడం సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో ఎక్సైజ్ జిల్లా అధికారి ఆదినారాయణమూర్తి పాల్గొన్నారు. సెలక్షన్ కమిటీలో జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్, రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ, తాను కూడా ఉన్నట్లు వివరించారు. ఎంపికైన వారిలో ఓసీ జనరల్ 21, ఓసీ మహిళ 13, ఎక్స్‌సరీస్‌మేన్ కోటాలో 2, ఎస్సీ జనరల్ 7, ఎస్సీ మహిళ 4, ఎస్టీ జనరల్ 6, ఎస్టీ మహిళ 3, బీసీ కోటాలో 15, బీసీ మహిళా కోటాలో 7, ఇతరులు 3 మంది ఉన్నట్లు పేర్కొన్నారు.