రాజీనామాలతో విభజన ఆగుతుంది
Published Sun, Sep 22 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: సీమాంధ్ర మంత్రులు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగుతుందని వైద్య ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఇజ్రాయిల్ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ కేంద్రాస్పత్రి ఆవరణలో సమైక్యాంధ్ర పేర్లు రాసిన బెలూన్లను ఎగుర వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విభజన వద్దు.. సమైక్యాంధ్ర ముద్దు .. ఒకే భాష ఒకే రాష్ట్రం అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజలు ఆందోళనల పేరుతో రోడ్డెక్కుతున్నా సీమాంధ్ర ప్రాంత పాలకులు, ఢిల్లీ పెద్దలు స్పందించకపోవడం దారుణమన్నారు.
సీమాంధ్ర ప్రాంత నాయకులు సోనియా భజన మానుకుని ఉద్యమానికి మద్దతుగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. పదవులకు రాజీనామా చేయకపోతే ప్రజలే తగిన సమయంలో నాయకులకు బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ వెంకటే్‌ష్, డాక్టర్ సత్యశ్రీనివాస్, డాక్టర్ ఫరిదుద్దీన్, డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ త్రినాథ్, వైద్య ఉద్యోగుల సంఘ నాయకులు బాలాజీ, ఉమాపతి, డి.త్రినాథ్, కిల్లాడి రాము, బాలాజీ ప్రాణిగ్రాహి, సుహాసిని, జయ, సుజాతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement