ఐవోసీ డీలర్ వర్రా గురివిరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి బుధవారం రూ.50 వేలు విరాళాన్ని స్థానిక ఎన్జీవో హోంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణి చేతుల మీదుగా ఎన్‌జీవో అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లుకు అందించారు.
ప్రొద్దుటూరు కల్చరల్, న్యూస్‌లైన్: ఐవోసీ డీలర్ వర్రా గురివిరెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి బుధవారం రూ.50 వేలు విరాళాన్ని స్థానిక ఎన్జీవో హోంలో తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఉషారాణి చేతుల మీదుగా ఎన్‌జీవో అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర్లుకు అందించారు. ఉద్యమంలో ప్రజలు పాలు పంచుకుని సమైక్యాంధ్ర సాధనకు కృషిచేయాలని ఈ సందర్భంగా గురివిరెడ్డి పేర్కొన్నారు. ఏఆర్‌బీసీవీఆర్ ట్రావె ల్స్ యాజమానులు బి.శ్రీనివాసులరెడ్డి, ఆసం సురేష్‌కుమార్‌రెడ్డిలు కడపలో జరిగే సమైక్యగర్జన కార్యక్రమానికి బస్సులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
హైదరాబాదులో జరిగే సమైక్యవాదుల సమావేశానికి కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని, అవసరమయ్యే డీజిల్‌ను పెట్రోలు బంకుల యాజమాన్యం ఉచితంగా సమకూరుస్తుందన్నారు. తహశీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉపాధ్యాయులు అన్ని వర్గాలవారు అలుపెరుగని పోరాటాలు చేయాలన్నారు. ఈవో పీఆర్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జునరెడ్డి, ఆర్‌ఐ రాఘవేంద్ర, వెటర్నరీ డాక్టర్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.