పదమూడు జిల్లాలకు చెందిన ఆర్టీసీ ఉద్యోగుల సమావేశం ముగిసింది.
గుంటూరు: పదమూడు జిల్లాలఆర్టీసీ ఉద్యోగుల సమావేశం ముగిసింది. ప్రపంచం ప్రఖ్యాతి గాంచిన ఆర్టీసీని విభజిస్తామంటే సహించలేదని ఈ సమావేశంలో తీర్మానించారు. గురువారం నాలుగు జోన్లలో సమ్మె నోటీసులు ఇవ్వడానికి ఆర్టీసీ ఉద్యోగులు సమాయత్తమవుతున్నారు. సీమాంధ్రలో ఉన్న 123 డిపోలలో రేపు అర్ధనగ్న ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం ఉంటుందని, 12వ తేదీన అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచుతామని ప్రకటించేవరకూ సమ్మెకొనసాగుతోందని ఆర్టీసీ ఉద్యోగులు తెలిపారు.
కాగా. సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మెకు దిగిన అనంతరం తాము నిరసన చేపడతామని టీఎంయూ ప్రకటించింది. ఇప్పటికే సీమాంధ్ర ఉద్యమంతో ఆర్టీసీ రోజుకు 45 కోట్లను కోల్పోతున్న విషయం తెలిసిందే.