అచ్చంపేట/కల్వకుర్తి, న్యూస్‌లైన్: ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్లే రూపాయి పతనం మొదలైందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. అస్థిరమైన విదేశీపెట్టుబడులను అనుమతించడం మూలంగా రూపాయి విలువ రోజురోజుకు పడిపోతుందన్నారు. ప్రభుత్వ విధానాల్లో మార్పురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అచ్చంపేట కందూరు ఎల్లయ్య ఫంక్షన్‌హాల్ ‘రూపాయి పతనం..పరిష్కార మార్గాలు’ అనే అంశంపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. అంతకుముందు కల్వకుర్తిలో జరిగిన సదస్సులో పాల్గొన్నారు. రూపాయి పతనానికి గల కారణాలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రూపాయి విలువ తగ్గి, డాలరు విలువ పెరగడం వల్ల రైతులు, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. సంపన్నులకు రాయితీలు తగ్గిస్తే రూపాయి విలువను కాపాడుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
17లక్షల కార్లకు లీటరు డీజిల్‌పై ప్రభుత్వం రూ.10 సబ్సిడీ ఇస్తుందని, దీనివల్ల రూ.20వేల కోట్లు విలువైన సబ్సిడీ సంపన్నులకు పోతుందన్నారు. విమానరంగం 16 శాతం పన్ను కడితే ఆర్టీసీ ద్వారా ప్రభుత్వం 23శాతం పన్ను కట్టించుకుంటుందని వివరించారు. ప్రభుత్వం పన్నుల విధానాన్ని సవరించాలని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. విలాసవంతమైన వస్తువులను దిగుమతులు చేసుకోవడం నిలిపేయాలని, ఎగుమతుల పెరుగుదల పెరగాలని కోరారు. రూపాయిని పతనం నుంచి కాపాడేందుకు అవసరమైన అనేక మార్గాలను ప్రభుత్వానికి మేధావులు సూచిస్తున్నప్పటికీ వారి మాటలను లె క్కచేయడం విమర్శించారు.
విద్యావంతులు, మేధావులు రూపాయి విలువ పడిపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి ప్రజలను చైతన్యం తీసుకరావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి ఎల్.దేశ్యానాయక్, శ్రీనివాసులు, సీఐటీయు డివిజన్ కార్యదర్శి మల్లేష్, ఎంఈఓ రామరావు, యూటీఎఫ్ నాయకులు ఎల్. చందునాయక్, సీఐటీయూ నాయకులు ఆంజనేయులు, యూటీఎఫ్ నేత ఏపీ మల్లయ్య, నాయకులు శ్రీను, చిన్నయ్య, అవోపా నాయకులు నర్సింహ్మయ్య, జేవీవీ నాయకులు రాజేందర్‌రెడ్డి, పుల్లయ్య,హెచ్. సర్ధార్, కేవీపీఎస్ నేత లక్ష్మణ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లక్పతినాయక్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి పతనం
Published Mon, Oct 7 2013 3:17 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement