సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా అధికారుల నుంచి మండల స్థాయి అధికారుల వరకు ఎన్నికల బదిలీల జ్వరం పట్టుకుంది. ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు తమను ఏ మూలన పడేస్తారోననే భయం వారిని ఆవహించింది. దీంతో వారు వీరు అని కాకుండా దాదాపు అందరూ సేఫ్ జోన్ల కోసం పైరవీలు ప్రారంభించారు.
లోక్‌సభ, శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలోమూడేళ్ల కాలం పూర్తి చేసిన జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో పాటు, పోలీసుల అధికారులను సైత ం జిల్లా దాటించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి పంపింది. జిల్లా నుంచి ఈ జాబితాలో జాయింట్ కలెక్టర్ లక్ష్మీ కాంతం, అదనపు జాయింట్ కలెక్టర్ పెంచల్‌రెడ్డి, డీఆర్వో రామిరెడ్డితో పాటు మరికొందరు అధికారులు ఉన్నారు. వీరితో పాటు జిల్లాలోని 56 మంది తహశీల్దార్లు, 42 మంది ఎంపీడీవోలు కూడా బదిలీలకు సిద్ధం కావాల్సి వచ్చింది. ఉద్యోగ విరమణకు ఆర్నెల్ల గడువు మాత్రమే ఉన్న వారికి ఎన్నికల సంఘం బదిలీ నుంచి మినహాయింపునిచ్చి ఇలాంటి వారిని ప్రాధాన్యత లేని పోస్టుల్లో నియమించాలని ఆదేశించింది. ఈనెల 10వ తేదీకి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా స్థాయి అధికారులు నెల్లూరు నుంచి అటు చిత్తూరుకో, ఇటు ఒంగోలుకో వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలా కుదరని పక్షంలో స్థానికంగానే ప్రాధాన్యత లేని పోస్టుల్లోనో, ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టుల్లోనో నియమింప చేసుకోవడానికి అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అనేక మంది తహశీల్దార్లు, ఎంపీడీవోలు సైతం రాజధానికి చేరుకుని పైరవీలు ప్రారంభించారు. ఎంతో కాలంగా జిల్లాలో పనిచేసి ఇప్పుడు వేరే జిల్లాకు వెళితే ఇబ్బందులు ఎదురవుతాయని, కుటుంబానికి దూరం కావడంతో పాటు, ఇతర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులందరూ కంగారు పడుతున్నారు. జిల్లా స్థాయి అధికారి ఒకరు పక్కనే ఉన్న చిత్తూరుకు వెళ్లడానికి పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
గతంలో ఆ జిల్లాలో పని చేసినందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదని, నెల్లూరుకు కూడా దగ్గరే ఉండటంతో కుటుంబానికి అందుబాటులో ఉండొచ్చనే అభిప్రాయంతో ఆయన అధికార పార్టీ ముఖ్య నేత ద్వారా సంబంధిత శాఖ కార్యదర్శిపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలి సింది. ఇదే కోవలో అనేక మంది తమ చేతనైన మేరకు పైరవీలు జరుపుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో బది లీల ఉత్తర్వులు జిల్లాకు అందనుండటంతో కొందరు నాలుగైదు రోజులుగా రాజధానిలోనే మకాం వేశారు. ఎన్‌జీవోల సమ్మెతో బదిలీలకు ఎలాంటి సంబంధం ఉండదని, ఉత్తర్వులు అందిన వెంటనే కొత్త స్థానాలకు వెళ్లక పోతే కొత్త చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా స్థాయి అధికారి ఒకరు ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు.
సేఫ్ జోన్ల కోసం పైరవీలు
Published Thu, Feb 6 2014 3:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement