దూరవిద్య అడ్మిషన్లకు దరఖాస్తుల విక్రయం ప్రారంభం
Published Wed, Sep 18 2013 12:52 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: ఎస్వీ యూనివర్సిటీలోని దూరవిద్యా విభాగం ద్వారా పీజీ, యూజీ, బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్వీయూలో దూరవిద్య కోర్సుల కోసం ఈనెల 14న వీసీ రాజేంద్ర నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి దరఖాస్తుల విక్రయం, స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. దూర విద్యా విభాగం డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి మంగళవారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఎస్వీయూ దూరవిద్య విభాగం ద్వారా తెలుగు, ఇంగ్లిషు, హిందీ, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సోషియల్ వర్క్, పబ్లిక్ రిలేషన్స్, గణితం, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ, సైకాలజీ, కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సులు నిర్వహిస్తున్నామని తెలి పారు.
ఈ కోర్సుల్లో చేరడానికి నవంబర్ 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి విద్యార్హతా లేని వారికి డిగ్రీలో ప్రవేశానికి 2014 ఫిబ్రవరి 9న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష రాయాలనుకొనేవారు జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రెండేళ్ల సర్వీసు కలిగిన ఇన్ సర్వీసు టీచర్లు బీఈడీలో చేరడానికి అర్హులన్నారు. ఈ కోర్సుల్లో చేరదల చినవారు జనవరి 20వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.ఉద్యమం ఆగిన వెంటనే పరీక్షలుఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగంలో పీజీ, డిగ్రీ చదువుతున్న రెండో సంవత్సర విద్యార్థులకు వార్షిక పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని దూరవిద్య విభాగం డెరైక్టర్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేకపోతున్నామన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే వారు పరీక్ష ఫీజు తక్షణమే చెల్లించాలని కోరారు.
Advertisement