తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: సమైక్య ఉద్యమానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం దుయ్యబట్టారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం జోడిమెట్లలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతరుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లలేదని, ప్రస్తుతం సీమాంధ్ర ఉద్యమంతో విద్యుత్ నిలిచిపోయిందని, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. ఈ కారణ ంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ కోసం ఇక్కడ ఉద్యమం చేస్తున్న రోజుల్లో ఇంట్లో ఉన్న నాయకులను సైతం ప్రభుత్వం అరెస్టులు చేయించిందన్నారు. ఉద్యమకారులపై వందలాది కేసులు పెట్టిందని తెలిపారు. సమైక్య ఉద్యమకారులపై ప్రభుత్వం ఉదాసీనత వైఖరిని అవలంబించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
హైదరాబాద్‌పై కిరికిరి చేస్తే మళ్లీ ఉద్యమం: దేవీప్రసాద్
మేడ్చల్,న్యూస్‌లైన్: హైదరాబాద్‌పై ఎవరు కిరికిరి పెట్టినా మరోసారి ఉద్యమం తప్పదని టీఎన్‌జీఓల అధ్యక్షుడు దేవీ ప్రసాద్ హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం దక్కించుకోవడానికి సీమాంధ్ర ప్రజలను దీక్ష పేరుతో గందరగోళంలోకి నెట్టారని విమర్శించారు. సోమవారం ఆయన రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ సీమాంధ్రలో అశోక్‌బాబును అడ్డుపెట్టుకుని ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్నారు.
తెలంగాణ ఉద్యోగుల అక్రమ బదిలీలు: శ్రీనివాస్‌గౌడ్ ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో, సంస్థల్లో ఉన్నత స్థానాల్లోని తెలంగాణ ఉద్యోగులను, అధికారులను అక్రమంగా బదిలీ చేస్తున్నారని టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆయున సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, మార్క్‌ఫెడ్ సీఎండీ, కోఆపరేటివ్ సొసైటీ ఎండీలతోపాటు కీలకమైన శాఖల అధిపతులుగా ఉన్న తెలంగాణ అధికారులను తొలగించి ఆయూ స్థానాలను సీమాంధ్రులకు కేటాయించారని, దీని వెనుక సీమాంధ్ర మంత్రులు, ఐఏఎస్‌ల ప్రోద్భలముందని ఆరోపించారు.
ప్రభుత్వ అండతోనే ‘సమైక్యం’ : కోదండరాం
Published Tue, Oct 8 2013 1:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM
Advertisement
Advertisement