ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కులవివక్షత పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా అధ్యక్షుడు సీహెచ్
మహేశ్వరం, న్యూస్‌లైన్: ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కులవివక్షత పోరాట సమితి (కేవీపీఎస్) జిల్లా అధ్యక్షుడు సీహెచ్. జంగయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రం లోని ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. మూత్రశాలలు సరిపడా లేక దుర్వాసన వెదజ ల్లుతోందన్నారు.
హాస్టళ్లలో పూర్తిస్థాయి వార్డెన్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుంటే కేవీపీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండలంలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, ఎంపీడీఓ నీరజకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు ఎల్లయ్య, జంగయ్య శ్రీనివాస్, ఎం.మహేందర్ తదితరులు పాల్గొన్నారు.