జడ్జిలకు సమస్యల పరిష్కార నైపుణ్యం ఉండాలి: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయమూర్తిగా రాణించాలంటే చట్టపరమైన అధికారం ఒక్కటే సరిపోదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. మానవ జీవితాన్ని, మనుషుల సమస్యలను అర్థంచేసుకొని, పరిష్కరించే నేర్పు అలవర్చుకోవాలని, వారికి అదే అతిపెద్ద సాధనమని పేర్కొన్నారు. బుధవారం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ప్రసన్న బి.వరాలేను సత్కరించారు. నూతన న్యాయమూర్తు నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య గరిష్టంగా 34కు చేరిందని జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. వారి అనుభవంతో సుప్రీంకోర్టుకు మంచి పేరు వస్తుందని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను పరిష్కరించే నైపుణ్యమే మనల్ని గొప్ప న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా మారుస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment