విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్ : ప్రతి సీహెచ్‌ఎన్‌సీలోనూ స్కానింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ కాంతిలాల్‌దండే అధికారులను ఆదేశించారు. గర్భస్థ పూర్వ, గర్భస్థ లింగనిర్ధారణ వ్యతి రేక చట్టం-1994పై శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 49 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, సీహెచ్‌ఎన్‌సీ ఎస్‌పీహెచ్‌ఓకు ఆ ప్రాంత పరిధిలో ఉన్న సెంటర్ల పర్యవేక్షణను అప్పగించామని ఈ సందర్భంగా డీఎం హెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి కలెక్టర్‌కు వివరించారు. రెండు కొత్త స్కానింగ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. లింగ నిర్ధారణ ఎక్కడైనా వెల్లడవుతుందా? అని ప్రశ్నిం చారు. ప్రతి స్కానింగ్ సెంటర్ నిర్వాహకులూ నివేదికలను సకాలంలో ఇస్తున్నారా, లేదా? బాలబాలికల నిష్పత్తి ఏ విధంగా ఉందని డీఎంహెచ్‌ఓను ప్రశ్నించారు. జిల్లాలో లింగ నిర్ధారణ ఎక్కడా వెల్లడికావడం లేదని ఆమె సమాధానమిచ్చారు. ప్రతి వెరుు్య మంది బాలురకూ 960 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. కొమరాడ, సాలూరు, పాచిపెంట, ఎల్.కోటలలో వెరుు్య మంది బాలురకు వెరుు్యమంది బాలికలు ఉన్నారని తెలిపారు.
గరుగుబిల్లి, జియ్యమ్మవలస, పార్వతీపురం, బొబ్బిలి, గరివిడి మండలాల్లో బాలికల సంఖ్య తక్కువగా ఉందని చెప్పారు. ఆడపిల్లల సంఖ్య తగ్గకుండా చూడాలని, ఈ మేరకు ఆశ వర్క ర్లు, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామస్థారుులో అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచిం చారు. చాలా మంది వైద్య సేవల కోసం, లింగ నిర్ధారణ తెలుసుకోవడానికి రాయగడ ప్రాంతానికి వెళ్తున్నారని పార్వతీపురం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఉమమహేశ్వరావు చెప్పారు. పార్వతీపురం ప్రాంతంలోనూ మెరుగైన వైద్యసేవలు అందేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గంటా హైమావతి, అదనపు వైద్య ఆరోగ్యశాఖాధికారి సి.పద్మజ, డీటీసీఓ రామారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సీహెచ్‌ఎన్‌సీలోనూ స్కానింగ్ సెంటర్
Published Sat, Jun 7 2014 2:59 AM | Last Updated on Mon, Jul 23 2018 9:11 PM
Advertisement