హైదరాబాద్ : కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లో సీమాంధ్ర కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారని ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి విరుచుకు పడ్డారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేబినెట్లో తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సీమాంద్ర జిల్లాల్లో నేడు అన్ని మండల కేంద్రాల్లో కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 10న కేంద్ర కేంద్రాలయాలు మూసివేత, 12న జాతీయ రహదారులు ముట్టడిస్తామన్నారు. మరోవైపు ఏపీ ఎన్జీవోల సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో సుమారు 4 లక్షల మంది పాల్గొన్నారు. సీమాంధ్రలో పాలన స్తంభించింది.