విభజనపై గవర్నర్‌తో నేతల భేటీలు | seemandhra congress leaders meet governor for bifurcation | Sakshi
Sakshi News home page

విభజనపై గవర్నర్‌తో నేతల భేటీలు

Published Sun, Nov 24 2013 1:24 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

seemandhra congress leaders meet governor for bifurcation

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లుపై చురుగ్గా ముందుకు కదులుతున్న కేంద్రం, కాంగ్రెస్ పార్టీ... అసెంబ్లీలో చర్చ సందర్భంగా సానుకూల వాతావరణం ఏర్పరచడంపై దృష్టి సారించాయి. ఇందుకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతోపాటు, సహకారమంది స్తున్న ఇతర పార్టీల నేతలతోనూ నిరంతర మంతనాలు సాగిస్తున్నాయి. సోనియాగాంధీ ఇప్పటికే సీమాంధ్ర ముఖ్య నేతల్ని ఢిల్లీకి పిలిపించి మరీ మాట్లాడుతుండటం, దిగ్విజయ్ తదితరులు బిల్లుపై వ్యవహరించాల్సిన వైఖరిపై ఫోన్లలోనే సూచనలు చేస్తుండటం తెలిసిందే. మరోపక్క గవర్నర్ నరసింహన్‌తో సీనియర్ మంత్రులూ భేటీ అవుతున్నారు. ప్రధానంగా విభజన, అసెంబ్లీలో చర్చ తదితరాల పైనే మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.
 
 పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇటీవలే గవర్నర్‌ను కలిశారు. వీరిద్దరూ విభజన సంబంధిత పరిణామాలపైనే ఆయనతో చర్చిం చారు. శనివారం మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్‌తో ముప్పావుగంటసేపు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ఇటీవలే ఢిల్లీలో సోనియాతో భేటీ కావడం తెలిసిందే. విభజనకు సహకరించేలా సీఎం పదవి తీసుకొనేందుకు అధిష్టానంతో కన్నా ఒప్పందం కుదుర్చుకున్నారం టూ ప్రచారమైంది. ముఖ్యంగా సీఎం కిరణ్ సన్నిహితులు ఈ మేరకు బాగా ప్రచారం చేయించారు. సీఎం పదవి ఆశించడం లేదని కన్నా ఖండించినా కాంగ్రెస్ నేతల్లో ఆ దిశగానే చర్చ సాగుతోంది. ఈ తరుణంలో గవర్నర్‌తో ఆయన భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement