దేవాదాయశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.
కడప: దేవాదాయశాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వ్యక్తి కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ సంఘటన కడప పట్టణంలోని కో-ఆపరేటివ్ కాలనీలో ఉన్న దేవాదాయశాఖ కార్యాలయంలో సోమవారం వెలుగు చూసింది. కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న టి. రాములు(50) ఎప్పటిలాగే ఈ రోజు కార్యాలయానికి వచ్చాడు. ఎవరు గమనించని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి ఉద్యోగులు అతన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.