ఇదేం పని సారూ..
Published Thu, Mar 30 2017 9:02 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
బంగోలు: పాఠశాలల్లో పారిశుద్ద్య కార్మికులు లేరు...గత ఆగస్టు నుంచి కాని ప్రధానోపాధ్యాయుల తప్పుడు రాతలతో ఉన్నట్టు రాసి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం వెలుగు ద్వారా గత ఏడాది తాత్కాలిక పద్ధతిపై కార్మికులను నియమించింది. అయితే జూలై తరువాత ఆమోదం లేకపోవటంతో గత ఏడాది ఆగస్టు 1 నుంచి పాఠశాలలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తొలగించారు.
విద్యాశాఖ, వెలుగు అధికారులు మూడు రోజుల నుంచి హడావుడిగా ప్రధానోపాధ్యాయులకు ఫోన్ చేసి మీ పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు పనిచేసినట్లుగా యుటిలైజేషన్ సర్టిఫికెట్ తేవాల్సిందిగా చెప్పారు. మార్కాపురం మండలంలో 78పాఠశాలలు ఉండగా, 60పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ కార్యాలయానికి యూసీలు అందించారు. ఒక్కొక్క పారిశుద్ధ్య కార్మికునికి నెలకు రూ.1800 వెలుగు ద్వారా అందిస్తారు. గత సంవత్సరం నుంచి లేని కార్మికులను ఉన్నట్టు రికార్డులలో చూపి హెచ్ఎంలే డబ్బులు తీనడానికి పూనుకున్నారని తెలిసింది అధికారులకు దీంతో వారు చర్యలు తప్పవని హెచ్చరించారు. వెలుగు ఏపీఎం రమేష్‌ను వివరణ కోరగా ప్రభుత్వం జూన్, జూలైకి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
Advertisement
Advertisement