
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆరు ప్రైవేటు ఆర్థిక నగరాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు రాష్ట్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.22,280 కోట్ల వ్యయంతో 980 ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబునాయుడు ఏపీ టిడ్కో, మున్సిపల్, పరిపాలన శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో వీటికి ఆమోదం తెలిపారు.
పినపాక– చెవుటూరు (కృష్ణాజిల్లా), మంగళగిరి (గుంటూరు జిల్లా), అచ్యుతాపురం(విశాఖ జిల్లా), తాండ్రపాడు–తడకనపల్లి(కర్నూలు జిల్లా), రాజమండ్రి సమీపంలోని వెలుగుబండ(తూర్పుగోదావరి), వెదురువాడ(విశాఖ జిల్లా)లలో ఈ ఆర్థిక నగరాల ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలను అధికారులు సీఎంకు వివరించారు.