అల్లాదుర్గం రూరల్, న్యూస్‌లైన్: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలో పలు అక్రమాలు బయట పడ్డాయి. అల్లాదుర్గం మండలంలో వారం రోజులుగా చేపట్టిన సామాజిక తనిఖీ సందర్భంగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రజాదర్బార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీడీ హరినాథ్‌బాబు, విజిలెన్స్ అధికారి రాంరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక సిబ్బందిలో తనిఖీలో బయట పడ్డా అక్రమాలను సమావేశంలో చదివి వినిపించారు. ఏప్రిల్ 2013 నుంచి డిసెంబర్ 31 మండలంలో రూ.కోటి 60 లక్షల పనులు చేపట్టారు. ఈ పనులపై గ్రామాల్లో ఎస్‌ఆర్‌పీ ఈశ్వర్ అధ్వర్యంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. పల్వాట్ల గ్రామానికి చెందిన కొల్లురి భూమయ్య, చిన్న భూమయ్యలకువితంతు పించన్లు మంజూరయ్యయి.
భర్తలు ఉండగానే అదే గ్రామానికి చెందిన సాలె ఈశ్వరమ్మ, కొల్లురి స్వరూపకు వితంతు పింఛన్లు మంజూరవుతున్నట్లు బయట పడింది. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దుదేకుల హుస్సేన్ నాలుగేళ్ల క్రితం చనిపోతే ఇప్పటికీ ఆయనపేరుపై పింఛను మంజూరవుతునే ఉంది. అదే గ్రామానికి చెందిన బాలమణికి రెండు వితంతు పింఛన్లు మంజూరవుతున్నాయి. ఇందులో ఒకటి ఆమెకు చెల్లించి, మరొకటి స్వాహా చేస్తున్నట్లు తనిఖీలో బయట పడింది. ముస్లాపూర్, కెరూర్, గడిపెద్దాపూర్ గ్రామాల్లో సైతం పింఛన్లలో అక్రమాలు వెలుగు చూశాయి. చనిపోయిన వారి పింఛన్లు రద్దు చేయకుండా అలాగే మంజూరు చేసుకుంటూ స్వాహా చేస్తున్నట్లు సామాజిక సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ గంగారాం, ఎంపీడీఓ సుధీర్, మాజీ ఎంపీపీ కాశీనాథ్, ిపీఏసీఎస్ చైర్మన్ నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రూ. లక్షా 78 వేల 878లు రికవరీ
సామాజిక తనిఖీలో బయపడిన అక్రమాలపై విచారణ చేపట్టి సొమ్ము రికవరీ చేసి చర్యలు తీసుకుంటామని ఏపీడీ హరినాథ్‌బాబు స్థానిక విలేకరులతో పేర్కొన్నారు. మండలంలో రూ.లక్షా 78 వేల 878లు రికవరీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సామాజిక తనిఖీలో బయటపడిన పెన్షన్ అక్రమాలు
Published Tue, Feb 18 2014 11:41 PM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement