అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
వివిధ శాఖల సమీక్షలో చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో: అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వేసవిలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. నీటి ఎద్దడి, పశుగ్రాసం కొరత, సాగునీరు, వ్యవసాయం, ఉద్యాన పంటలు తదితర వాటిపై అధికారులను అడిగి, పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా మనుషులు, పొలాలు, పశువులకు నీటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆన్‌లైన్‌లో ఉద్యాన పంటల వివరాలు..
వ్యవసాయ శాఖ మాదిరి ఉద్యాన శాఖలో నూ పంటల వివరాలు ఆన్‌లైన్ చేయాలని, సర్వే నెంబరు సహా మొత్తం సమాచారాన్ని అందులో ఉంచాలని సీఎం ఆదేశించారు.