గన్నవరం విమానాశ్రయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కలకలం రేగింది.
విజయవాడ: గన్నవరం విమానాశ్రయం వద్ద శుక్రవారం మధ్యాహ్నం కలకలం రేగింది. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న అయిదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగం పోలీసులు విచారిస్తున్నారు. దీంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీ చేపట్టింది. పట్టుబడిన అయిదుగురిని జమ్ముకాశ్మీర్ నుంచి వచ్చిన జావెద్ అహ్మద్, జావెద్ అక్బర్, అమిరాహ్ పాల్, సనలాహ్ భట్, బషీర్ అహ్మద్ షేక్ గా నిఘా అధికారులు గుర్తించారు.