పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నాలుగున్నర కోట్ల ప్రజలకు ఇచ్చిన మా టకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కొత్తవాడ 80 ఫీట్ రోడ్‌లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపంను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సారయ్య మాట్లాడుతూ సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోనియా గాంధీ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాను సీఎం కాకముందు ఉన్న ఆస్తులను, తర్వాత వాటిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ అమరుల త్యాగాలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న సోనియాగాంధీ చిత్రపటాన్ని తమ ఇళ్లలో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలన్నారు.
తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేయకుండా త్వరతిగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట యోధులను, స్వాతంత్య్ర సమర యోధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు యెలుగం శ్రీనివాస్, దామెర సర్వేష్, బస్వరాజు కుమారస్వామి, కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు, బూర రమేష్, రమేష్, డేగల గంగాధర్, వావిలాల సదానందం పాల్గొన్నారు.
మంత్రి సారయ్య పర్యటనలో ఉద్రిక్తత
బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కొత్తవాడలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించేందుకు మంత్రి సారయ్య హాజరయ్యారు. అయితే స్థూపాన్ని తెలంగాణగాంధీ భూపతి కృష్ణమూర్తితో ఆవిష్కరించాలని అమరవీరుల స్థూపం నిర్మాణ కమిటీ కన్వీనర్ కటకం విజయ్‌కుమార్ పట్టుబట్టారు. దీంతో విజయ్‌కుమార్ వాదనకు అక్కడున్న వారు ఏకీభవించకుండా మంత్రి సారయ్యతో స్థూపాన్ని ఆవిష్కరింపజేశారు. తెలంగాణ వాదులను కొట్టించిన కాంగ్రెస్ మంత్రితో అమరుల స్థూపాన్ని ఎలా ఆవిష్కరింపజేశారని జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల మరణానికి కారణమైన వారితో అమరవీరుల స్థూపంను ఎలా ఆవిష్కరిస్తారని ప్రశ్నించా రు. తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తితో ఆవిష్కరించాలని పట్టుబడంతోనే నాపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నించారన్నారు.
మాటకు కట్టుబడిన సోనియా
Published Wed, Sep 18 2013 2:56 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement