'తెలంగాణలో పార్టీ పరిస్థితిపై సోనియా సర్వే'
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై సోనియాగాంధీ సర్వేలు చేయిస్తున్నారని మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రస్తుతం పదవులు ఆశిస్తున్న వారెవ్వరూ నిజమైన తెలంగాణవాదులు కారని సోనియా గ్రహించారని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. కొందరు తెలంగాణ మంత్రులు ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్నారని హైకమాండ్ గ్రహించిందని కోమటిరెడ్డి అన్నారు.
ప్రభుత్వం తెలంగాణ బిల్లును వెంటనే అసెంబ్లీకి పంపాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. విభజన బిల్లుపై చర్చ జరపాలని తెలంగాణ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో డిమాండ్ చేస్తామన్నారు. దిగ్విజయ్ సింగ్ను అడ్డుకుంటే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యలు అవుతారని అన్నారు. ముఖ్యమంత్రి, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణ బిల్లును సభలో అడ్డుకుంటే ....హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులకు ఏదైనా జరిగితే వారు బాధ్యత వహించాలని కోమటిరెడ్డి హెచ్చరించారు.