సోనియా ప్రకటనను స్వాగతిస్తున్నాం: చీఫ్ విప్ గండ్ర
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటనను స్వాగతిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ప్రభుత్వ కమిటీ ఏర్పాటు అవుతున్నందున సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె విరమించాలని గండ్ర విజ్ఞప్తి చేశారు.
టీడీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది అని చీఫ్ విప్ గండ్ర విమర్శించారు. రెండు ప్రాంతాల ప్రజలను గందరగోళపరిచే టీడీపీ విధానం సరికాదు ఆయన హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం చర్చకు వస్తుంది అని ఆయన తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందుతుంది అని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.