ప్రత్యేక హోదా ఇప్పట్లో కష్టమే-బాబు | special status to andhra pradesh maynot be possible | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఇప్పట్లో కష్టమే-బాబు

Published Mon, Jan 26 2015 2:44 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా ఇప్పట్లో కష్టమే-బాబు - Sakshi

ప్రత్యేక హోదా ఇప్పట్లో కష్టమే-బాబు

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇప్పట్లో వచ్చేలా లేదని...కేంద్రప్రభుత్వం సంక్షోభంలో ఉన్నందున సహాయం కోసం ఎదురుచూసినా ఫలితం ఉండకపోవచ్చని ఆ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చెప్పినట్టు సమాచారం. విజయవాడలో సోమవారం అందుబాటులో ఉన్న మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. దావోస్ పర్యటన, ఏపీ ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చంద్రబాబు మంత్రులతో సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్టుల వారీగా ఎక్కువ నిధులు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. అన్ని శాఖల మంత్రులు ప్రత్యేక ప్రతిపాదనలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రానికి ప్రైవేటు పెట్టుబడులు ఎక్కువగా వచ్చేలా ప్రయత్నించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement