సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-కాకినాడ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్-విజయవాడ (07101/07102) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న రాత్రి 10.40కు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11కు కాకినాడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో జూన్ 1రాత్రి 7.15 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ట్రైన్ నల్గొండ, మిరియాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు,విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌లలో ఆగుతుంది.
కాకినాడ-విజయవాడ (07209/07210) జనసాధారణ్ స్పెషల్ ట్రైన్ ఈ నెల 31న మధ్యాహ్నం ఒంటిగంటకు కాకినాడ నుంచి బయలుదేరి అదేరోజు సాయంత్రం 6.15 కు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.15కు విజయవాడ నుంచి బయలుదేరి తెల్లవారు జామున 5.20కి కాకినాడ చేరుకుంటుంది. సామర్లకోట,రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ స్టేషన్‌లలో ఆగుతుంది.
ఔరంగాబాద్-తిరుపతి (07405/07406) ప్రత్యేక రైలు ఈనెల 30 మధ్యాహ్నం 3కు ఔరంగాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.30కు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 31వ తేదీ సాయంత్రం 5.10 కి తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8కు ఔరంగాబాద్ చేరుకుంటుంది.ఇది మన రాష్ట్రంలో బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణి గుంట స్టేషన్‌ల్లో ఆగుతుంది.