తిరుమలలో అనధికార హాకర్లు పెరిగిపోయారు. కట్టడి చేయాల్సిన విభాగాల్లోని కొందరు అధికారులు కాసు ల వేటలో ఉన్నారు.
మామూళ్ల వసూళ్లలో అధికారులు
వేల సంఖ్యలో తయారైన అనధికార హాకర్లు
వ్యాపారాల్లో పెత్తనం కోసం ఆలయం వద్దే తరచూ ఘర్షణలు
ఇబ్బంది పడుతున్న భక్తులు
తిరుమల: తిరుమలలో అనధికార హాకర్లు పెరిగిపోయారు. కట్టడి చేయాల్సిన విభాగాల్లోని కొందరు అధికారులు కాసు ల వేటలో ఉన్నారు. ఫలితంగా సాక్షాత్తు ఆలయం వద్దే అనధికార హాకర్ల ఆగడాలు శ్రుతిమించాయి. ఆదివారం కొం దరు అనధికార హాకర్లు ముఠాలుగా విడిపోయి సీసాలతో దాడులకు దిగిన ఘట నలో చెన్నైకి చెందిన భక్తురాలు భాగ్య లక్ష్మి తలకు బలమైన గాయమై ఆస్పత్రి పాలైంది.
వేలల్లో అనధికార హాకర్లు..
తిరుమలలో అనధికార హాకర్ల సంఖ్య వేలకు చేరింది. ప్రధానంగా ఆలయం వద్ద నుంచి కల్యాణకట్ట వరకు వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. సంపాదన కోసం భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా సంబంధిత అధికారులెవరూ తొంగిచూడటం లేదు. అనధికార వ్యక్తుల ఏరివేతను సంబంధిత టీటీడీ, పోలీసు విభాగాలు ఏ మాత్రమూ పట్టిం చుకోలేదు. తిరుమల భద్రతా కారణాల రీత్యా అనధికార వ్యక్తుల వల్ల ఇబ్బందులుంటాయని తెలిసినా ఆ దిశగా ఇటు టీటీడీ విజిలెన్స్ కాని, పోలీసులు కాని పట్టించుకోవటం లేదు. తిరుమలలో వ్యాపారాలు సాగించేవారు గుర్తింపు కార్డులు ఉండాలన్న నిబంధన కూడా పట్టించుకోవటం లేదు.
మామూళ్ల మత్తులో అధికారులు
అనధికార వ్యక్తులను టీటీడీ, పోలీసు విభాగాలు ఎప్పటికప్పుడు ఏరివేయా ల్సి ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు మామూళ్లు అందుతుండడంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పైగా ఉన్నతాధికారులు సిబ్బందిని మామూళ్లు వసూ లు చేయటానికి వినియోగిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి.
లెసైన్సు, దుకాణదారులపై వేధింపులు
టీటీడీ నిబంధనల ప్రకారం వ్యాపారాలు సాగించే దుకాణదారులు, లెసైన్సుదారులు మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తరచూ వారిపై దాడులు జరుగుతున్నాయి. తిరుమలతో సంబంధం లేని అనధికార వ్యక్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నా వారిని కట్టడి చేయటానికి ఏడాదిలో కనీసం గంట సమయం కూడా కేటాయించలేదనే విమర్శలున్నాయి. పైగా దుకాణదారులు, లెసైన్సుదారులకు దీటుగా అనధికార హాకర్లను పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. టీటీడీ ఈవో సాంబశివరావు, సీవీఎస్‌వో నాగేంద్రకుమార్, ఏఎస్‌పీ ఎంవీఎస్ స్వామి అనధికార హాకర్ల కట్టడికి కృషి చేయకపోతే భక్తులకు తిప్పలు తప్పవని అధికారిక దుకాణదారులు, లెసైన్సుదారులు కోరుతున్నారు.