హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం కిరణ్ సర్కార్ శుభవార్త వినిపించింది. రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 13 శాఖల్లో ఖాళీగా ఉన్న 13,388 ఉద్యోగాల భర్తీకి కేబినెట్ మంగళవారం పచ్చజెండా ఊపింది. ఐసీడీఎస్లో 8,900, అటవీశాఖలో 3,820 ఉద్యోగ నియామకానికి ఆమోద ముద్ర వేసింది. కొత్త నియామకాలతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ. 2,400 కోట్ల అదనపు భారం పడనుంది. ఇక 13 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.