
పార్వతీపురం: రాష్ట్రంలో మే నెలలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా తెలిపారు. సోమవారం రాత్రి విజయనగరం జిల్లా పార్వతీపురం వచ్చిన ఆయన స్థానిక సబ్‌కలెక్టర్ అతిథి గృహంలో రాత్రి బస చేశారు. తనను కలసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ..మార్చిలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈవీఎంలపై అపోహలు తొలగించేందుకు జనాన్ని చైతన్యపరచనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment