ఆ ముగ్గురూ కలిసి రాష్ట్రం గొంతుకోశారు
ఆ ముగ్గురూ కలిసి రాష్ట్రం గొంతుకోశారు
Published Wed, Feb 26 2014 2:05 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
చిలువూరు(దుగ్గిరాల),న్యూస్‌లైన్:పెద్దమ్మ(సోనియా), చిన్నమ్మ(సుష్మా స్వరాజ్), చంద్రబాబు ముగ్గురూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గొంతు కోసి రాష్ట్రాన్ని రెండుగా విభజించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు వల్లభనేని బాలశౌరి విమర్శించారు. సోనియా గాంధీ గొంతు పట్టుకోగా, చంద్రబాబు అనే కత్తితో సుష్మాస్వరాజ్ గొంతు కోశారని వివరించారు. మంగళవారం చిలువూరు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల కాలంలో చంద్ర బాబు నోట ఏ రోజు కూడా సమైక్యాంధ్ర అనే మాట రాలేదన్నారు. రాష్ట్రాన్ని విభజించవద్దని స్పష్టంగా చెప్పిన వ్యక్తి ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే అని చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారన్నారు.
తెలంగాణ లోకూడా వైఎస్సార్‌ను ప్రేమించేవారు ఉన్నారని, ఆయన మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నవారు తెలంగాణ లోనూ ఎంతో మంది ఉన్నారన్నారు. వారికోసమే తెలంగాణ జిల్లాల్లో జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర చేయాలనుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించింది బీజేపీ కాబట్టి ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవాలా వద్దా అనే అయోమయంలో లో చంద్రబాబు వున్నారని బాలశౌరి చెప్పారు. తెలంగాణలో పొత్తుపెట్టుకోవాలని,మరోవైపు సీమాంధ్రలో పొత్తు పెట్టుకుంటే ఓట్లు రావని చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ యడ్ల వెంకట్రావు, నాయకులు పాటిబండ్ల కృష్ణ ప్రసాద్, గాజుల మోహన్, కె.విజయ్‌కుమార్, ఎ.నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement