ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపండి | strict controls on factionalism | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపండి

Published Tue, Aug 5 2014 3:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపండి - Sakshi

ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపండి

కర్నూలు : ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ జె.వి.రాముడు రాయలసీమ పోలీసు అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు కర్నూలుకు వచ్చిన ఆయన సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో రాయలసీమ అధికారులతో సమావేశమయ్యారు. పోలీసు శాఖలో ఇటీవల బదిలీలు చేపట్టడం.. రాయలసీమలో అందరూ కొత్త ఎస్పీలు కావడంతో సమావేశంలో వారితో జిల్లాల్లోని శాంతి భద్రతలపై చర్చించారు. ఫ్యాక్షనిస్టుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
 
శాంతి భధ్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించవద్దని సూచించారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయాలన్నారు.   స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా  అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.   అనంతరం కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో నమోదైన ఎర్ర చందనం అక్రమ రవాణా కేసుల విషయంపై ఆరా తీశారు.

అటవీ శాఖ అధికారుల సమన్వయంతో కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.  సమావేశంలో కర్నూలు రేంజ్ డీఐజీ మురళీకృష్ణ, అనంతపురం డీఐజీ బాలకృష్ణ, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కడప, తిరుపతి అర్బన్ ఎస్పీలు ఆకే రవికృష్ణ, శ్రీనివాసరావు, రాజశేఖర్‌బాబు, నవీన్ గులాఠి, గోపీనాథ్ జట్టీ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement