ఎస్‌కేయూ: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో లక్షలాదిగా ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు నేడు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చాయి. గ్రూప్-1, 2 ఉద్యోగాలతో పాటు జూనియర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ కళాశాల లెక్చరర్లుగా ప్రమోషన్ ఇవ్వాలనే ప్రతిపాదనను విరమించుకోవాలని కోరారు. బంద్‌లో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, ఏఐఎస్‌ఎఫ్ తదితర సంఘాలు పాల్గొంటున్నాయి.